తెలంగాణ

telangana

మొదటి రాత్రే భార్యను చంపి భర్త ఆత్మహత్య!

By

Published : Jun 11, 2020, 5:24 PM IST

Updated : Jun 11, 2020, 6:38 PM IST

పెళ్లై ఒక్కరోజు కూడా కాలేదు. ఆనందంగా గడపాల్సిన రోజు జరిగిన ఓ చిన్న వివాదం.. రెండు నిండు ప్రాణాలను బలిగొంది. భార్యతో జరిగిన వాగ్వాదంలో తీవ్ర ఆగ్రహానికి లోనైన భర్త కట్టుకున్న ఆలిని హతమార్చి.. అనంతరం తానూ ఆత్మహత్య చేసుకున్నాడు.

Married for hours, man kills wife, commits suicide in their first night
దారుణం: మొదటి రాత్రే భార్యను చంపేసిన భర్త!

తమిళనాడులో తిరువల్లూర్‌ జిల్లా మింజూర్​లో దారుణం జరిగింది. శోభనం గదిలోనే భార్యను దారుణంగా హత్య చేసిన భర్త అనంతరం ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

మొదటి రాత్రే భార్యను చంపేసిన భర్త!

ఇదీ జరిగింది..

లాక్‌డౌన్‌ నిబంధనల నేపథ్యంలో పరిమిత సంఖ్యలో బంధువుల మధ్య నీతివాసన్‌, సంధ్య వివాహబంధంతో ఒక్కటయ్యారు. అయితే తొలిరాత్రి రోజున గదిలో దంపతులిద్దరు గొడవపడ్డారు. వీరి సంభాషణ విన్న బంధువులు తలుపులు తీయమని అరిచారు. అయితే బంధువుల మాటలను వారు వినిపించుకోలేదు. ఆవేశంతో నీతివాసన్‌.. గునపంతో పొడిచి సంధ్యను హతమార్చాడు. అనంతరం రక్తపు మరకలతో నగ్నంగా బయటకు వెళ్లి ఇంటికి సమీపంలో ఓ చెట్టుకు ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు.

గదిలో రక్తపుమడుగులో పడి ఉన్న సంధ్యను చూసి బంధువులు దిగ్భ్రాంతికి గురయ్యారు. సంఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు శవపరీక్ష నిమిత్తం మృతదేహాలను..పొన్నేరి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దంపతుల మధ్య ఏ విషయమై గొడవ జరిగింది. ఇంతటి దారుణానికి దారి తీసిన పరిస్థితులేంటి అనేది తేలాల్సి ఉంది.

ఇదీ చదవండి:అత్త మీద కోపంతో కన్నబిడ్డను పొడిచి చంపిన తల్లి!

Last Updated : Jun 11, 2020, 6:38 PM IST

ABOUT THE AUTHOR

...view details