తెలంగాణ

telangana

పాఠం విని అత్యాచారం జరిగిందని గ్రహించిన బాలికలు

By

Published : Oct 10, 2020, 7:17 AM IST

కీచకుల ఆగడాలకు అభం శుభం తెలియని చిన్నారులు బలవుతూనే ఉన్నారు. తమపై లైంగిక దాడి జరిగిందనే విషయం తెలియకుండానే.. కామాంధుల కోరల్లో నలిగిపోతున్నారు. తాజాగా గుజరాత్​లో టీచర్ పాఠం చెప్తుండగా విని, తాము అత్యాచారానికి గురయ్యామని గ్రహించారు ఓ ముగ్గురు బాలికలు.

three minor girls raped in Vadodara
పాఠం విని అత్యాచారం జరిగిందని గ్రహించిన చిన్నారులు

గుజరాత్​లో దారుణం చోటు చేసుకుంది. ముగ్గురు బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డ ఓ నిందితుడి ఉదంతం బయటపడింది. చిన్నారులకు తమ ఉపాధ్యాయురాలు పాఠాన్ని చెప్తుండగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. వడోదరా జిల్లాలోని మర్కపురలో జరిగిందీ ఘటన.

పాఠం వింటూనే..

తమ ఉపాధ్యాయురాలు.. మంచి స్పర్శ, చెడు స్పర్శ(గుడ్​ టచ్​, బ్యాడ్​ టచ్​) అనే పాఠం గురించి చెప్తున్నప్పుడు తమపై అత్యాచారం జరిగిందన్న విషయాన్ని గ్రహించారు ఆ చిన్నారులు. బాధితుల్లోని ఓ బాలిక పాఠం వింటూ ఏడ్వటం మెదలుపెట్టింది. తర్వాత తమకు జరిగిన అనుభవాన్ని ఆ ఉపాధ్యాయురాలికి చెప్పారు మిగతా బాలికలు. సదరు టీచర్​ ద్వారా ఈ విషయం బయటకు వచ్చింది.

చాక్లెట్లు, స్వీట్లతో ఎర..

నిందుతుడిని రజినీకాంత్​ మహతోగా పోలీసులు గుర్తించారు. అతడిని అరెస్ట్​ చేశారు. చిన్నారులను లోబర్చుకోవడానికి చాక్లెట్లు, స్వీట్లతో నిందితుడు ఆశజూపే వాడని పోలీసులు తెలిపారు. చిన్నారులను తరచూ తన ఇంటికి తీసుకువెళ్లి వారిపై లైంగిక దాడికి పాల్పడేవారని చెప్పారు.

నిందితుడు దాష్టీకానికి బలైన వారిలో ఇంకా ఎవరైనా చిన్నారులు గానీ, మహిళలు గానీ ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ABOUT THE AUTHOR

...view details