తెలంగాణ

telangana

బంగాల్​లో నిరసనలు- భారీగా బలగాల మోహరింపు

By

Published : Oct 8, 2020, 12:36 PM IST

Updated : Oct 8, 2020, 1:12 PM IST

బంగాల్​లో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చెలరేగాయి. మమత ప్రభుత్వం అవినీతి, గూండా రాజకీయాలకు పాల్పడుతుందనే ఆరోపణలతో భాజపా నాయకులు ఆందోళనలు చేపట్టారు. ఈ నేపథ్యంలో భారీ ఎత్తున భద్రతా బలగాలను మోహరించారు అధికారులు.

Lathi-charge by Police to stop BJP workers in Dunkuni
బంగాల్​లో నిరసనలు- భారీగా భద్రత బలగాల మోహరింపు

బంగాల్​లో నిరసన జ్వాలలు చెలరేగాయి. మమతా బెనర్జీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా భాజపా నాయకులు భారీ ఎత్తున ఆందోళనకు దిగారు. అధికార ప్రభుత్వం అవినీతి, గూండా రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపిస్తూ ఆందోళనకారులు రహదారులపైకి వచ్చారు. 'చలో సచివాలయం' అంటూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు.

భద్రత బలగాలు
బంగాల్​లో నిరసనల సెగ

ఈ నేపథ్యంలో కోల్​కతాలో భారీగా భద్రత బలగాలను మోహరించారు అధికారులు. నిరసనకారులను అడ్డుకునేందుకు రహదారులపై బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టేందుకు వాటర్ కెనాన్​ వాహనాలను మోహరించారు.

వాటర్​ కెనాన్​ వాహనం
రహదారిపై ఏర్పాటు చేసిన బారికేడ్లు

ఈ నెల 2న కేంద్ర హోంమంత్రి అమిత్​షా, భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో భేటీ అయ్యారు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిలీప్​ ఘోష్​. ఈ సమావేశంలో అక్టోబరు 8న మమతా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు జరపాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. ఈ మేరకే భాజపా ఆందోళనలు చేపట్టినట్లు తెలుస్తోంది.

ఇదీ చూడండి:16 ఏళ్ల బాలికపై నెలరోజులుగా సామూహిక అత్యాచారం

Last Updated : Oct 8, 2020, 1:12 PM IST

ABOUT THE AUTHOR

...view details