తెలంగాణ

telangana

భారత్​ x చైనా: మరోసారి కమాండర్​ స్థాయి చర్చలు

By

Published : Nov 4, 2020, 5:31 AM IST

సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితులను తగ్గించే దిశగా భారత్​- చైనాల మధ్య మరోసారి చర్చలు జరగనున్నాయి. వాస్తవాధీన రేఖ వెంబడి ఇరుదేశాలు బలగాలను భారీగా మోహరించిన నేపథ్యంలో ఇప్పటికే పలు దఫాల వారీగా అధికారులు సమావేశం అయినా లాభం లేకుండాపోయింది.

india china commanders meet scheduled on November 8th
భారత్​-చైనా మరోసారి కమాండర్​ స్థాయి చర్చలు

తూర్పు లద్ధాఖ్ సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతలు తగ్గించడం సహా బలగాల ఉపసంహరణే లక్ష్యంగా భారత్- చైనా సైన్యాల మధ్య ఎనిమిదో విడత కార్ప్స్‌ కమాండర్ స్థాయి చర్చలు ఈ నెల 6న జరగనున్నాయి. అక్టోబర్ 12న జరిగిన ఏడో విడత చర్చల అనంతరం ఘర్షణాత్మక ప్రాంతాల పరిస్థితుల్లో పెద్దగా మార్పులేమీ జరగలేదు.

శీతాకాలంలో తూర్పు లద్ధాఖ్ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మైనస్ 25 డిగ్రీలకు పడిపోతాయి. ఈ క్రమంలో జరగనున్న ఎనిమిదో విడత చర్చలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ఇప్పటికే భారత్‌- చైనా సంబంధాలపై సరిహద్దు సమస్యల ప్రభావం ఎక్కువగా ఉంది. సరిహద్దులకు సంబంధించి జరిగిన ఒప్పందాలపై చైనా గౌరవం చూపాలని భారత్ ఇప్పటికే స్పష్టం చేసింది. ఈ శుక్రవారం నాడు జరిగే చర్చల్లో ఇటీవలే లేహ్ కమాండెంట్‌గా బాధ్యతలు తీసుకున్న లెఫ్టినెంట‌్ జనరల్‌ పీజీకే మేనన్‌ తొలిసారి సమావేశానికి హాజరవుతున్నారు.

ఇదీ చూడండి: మలబార్‌ విన్యాసాలపై ఉలిక్కిపడ్డ చైనా!

ABOUT THE AUTHOR

...view details