తెలంగాణ

telangana

మహారాష్ట్రలో కొత్తగా 11,813 కేసులు, 413 మరణాలు

By

Published : Aug 13, 2020, 5:56 PM IST

Updated : Aug 13, 2020, 9:42 PM IST

దేశంలో కరోనా విజృంభిస్తున్నప్పటికీ వైరస్​ బారినుంచి కోలుకుంటున్న వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని పేర్కొంది కేంద్ర ఆరోగ్య శాఖ. ఒక్కరోజులో రికార్డు స్థాయిలో 56,383 మంది వైరస్​ నుంచి కోలుకోగా.. దేశంలో రికవరీ రేటు 70.77 శాతానికి చేరుకున్నట్లు తెలిపింది. ఇదిలా ఉంటే మహారాష్ట్రలో కొత్తగా 11,813.., కర్ణాటకలో 6706.., తమిళనాడులో 5,835మందికి కరోనా సోకింది.

COVID-19 recovery rate rises to 70.77 pc
దేశంలో 70.77 శాతానికి చేరిన రికవరీ రేటు

దేశంలో ఓ వైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ.. అదే స్థాయిలో వైరస్​ నుంచి కోలుకుంటున్నారు. రోజుకు 60 వేలకుపైగా కొత్త కేసులు వస్తున్నప్పటికీ రివకరీలు పెరగటం ఊరట కలిగిస్తోంది. దేశంలో వైరస్​ నుంచి కోలుకున్న వారి సంఖ్య దాదాపు 17 లక్షలకు చేరువైన నేపథ్యంలో.. రికవరీ రేటు 70.77 శాతానికి చేరినట్లు కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఇదే సమయంలో మరణాలు రేటు మరింత తగ్గి 1.96 శాతానికి పడిపోయినట్లు తెలిపింది.

దేశంలో కోలుకుంటున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటం వల్ల యాక్టివ్​ కేసులు కేవలం 27.27 శాతంగానే ఉన్నట్లు తెలిపింది కేంద్రం. యాక్టివ్​ కేసులతో పోలిస్తే కోలుకున్న వారు 10 లక్షలు ఎక్కువగా ఉన్నారు. గురువారం ఒక్కరోజే 56,383 మంది వైరస్​ నుంచి బయటపడ్డారు. దీంతో మొత్తం రికవరీలు 16,95,982కు చేరాయి. ప్రస్తుతం 6,53,622 యాక్టివ్​ కేసులు ఉన్నాయి.

మహారాష్ట్రలో..

మహారాష్ట్రలో కరోనా కరాళ నృత్యం చేస్తోంది. ఇవాళ కొత్తగా 11,813 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. 413 మంది మరణించారు. అయితే, 9115 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 5,60,126కు చేరాయి. 3,90,958 మంది డిశ్చార్జి అయ్యచారు. 1,49,789 మంది చికిత్స పొందుతున్నారు.

కర్ణాటకలో..

కర్ణాటకలో కొవిడ్​ ఉద్ధృతి కొనసాగుతోంది. రోజు రోజుకు కొత్త కేసుల నమోదులో సరికొత్త రికార్డులు నమోదవుతున్నాయి. ఇవాళ 6706 మందికి వైరస్​ పాజిటివ్​గా నిర్ధరణ అయింది. 103 మంది మరణించారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 1,21,242కు, మరణాలు 3613కు చేరాయి.

తమిళనాడులో..

తమిళనాడులో కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ఇవాళ కొత్తగా 5,835 కేసులు నమోదయ్యాయి. 119 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదే సమయంలో 5,146 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం కేసులు 3,20,355, మరణాలు 5,397కు చేరాయి. 2,61,459 మంది వైరస్​ నుంచి బయటపడగా.. 53,499 మంది చికిత్స పొందుతున్నారు.

దిల్లీలో మళ్లీ..

దేశ రాజధాని దిల్లీలో మళ్లీ వైరస్​ విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 956 మందికి వైరస్​ నిర్ధరణ అయింది. 14 మంది మరణించారు. మొత్తం కేసుల సంఖ్య 1,49,460కి చేరింది. ఇందులో 1,34,318 మంది వైరస్​ నుంచి కోలుకోగా.. ఇంకా 10,975 మంది చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు హస్తినలో 4167 మంది ప్రాణాలు కోల్పోయారు.

దిల్లీలో ఇప్పటి వరకు 1,25,80,95 పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు వెల్లడించారు.

కేరళలో...

కేరళలో వైరస్​ మళ్లీ విజృంభిస్తోంది. ఇవాళ కొత్తగా 1564 మందికి వైరస్​ నిర్ధరణ కావటం ఆందోళ కలిగిస్తోంది. ఇందులో 15 మంది ఆరోగ్య సిబ్బంది ఉన్నారు. ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. 766 మంది వైరస్​ నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 13,839 మంది చికిత్స పొందుతున్నారు.

పంజాబ్​లో...

పంజాబ్​లో ఇవాళ కొత్తగా 1035 కేసులు నమోదయ్యాయి. 36 మంది ప్రాణాలు కోల్పోయారు. మొత్తం కేసుల సంఖ్య 27,936కు చేరగా.. 706 మంది మరణించారు.

ఇదీ చూడండి:రోడ్డుపై యాసిడ్​ ట్యాంకర్​ లీక్​.. అంతా భయం గుప్పిట్లో!

Last Updated : Aug 13, 2020, 9:42 PM IST

ABOUT THE AUTHOR

...view details