తెలంగాణ

telangana

పుల్వామాలో పౌరుడ్ని కాల్చి చంపిన ముష్కరులు

By

Published : Aug 16, 2020, 5:06 AM IST

జమ్ముకశ్మీర్​ పుల్వామాలో ఓ సాధారణ పౌరుడి ప్రాణాలు బలిగొన్నారు ముష్కరులు. తన నివాసంలోనే తుపాకులతో విచక్షణా రహితంగా కాల్పులు జరిపి హతమార్చారు. ఉగ్రవాదులు పౌరడ్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారనే విషయంపై ఎలాంటి సమాచారం లేదని పోలీసులు తెలిపారు.

Civilian shot dead by militants in Pulwama
పుల్వమాలో పౌరుడ్ని కాల్చి చంపిన ముష్కరులు

జమ్ముకశ్మీర్ పుల్వామా జిల్లా దదూరా-కంగన్ ప్రాంతంలో ఉగ్రవాదులు దుశ్చర్యకు పాల్పడ్డారు. ఓ పౌరుడి ఇంటిపై దాడి చేసి తుపాకులతో కాల్చి చంపారు. శనివారం రాత్రి 9:40 గంటలకు ఘటన జరిగినట్లు పోలీసులు తెలిపారు. మరణించిన వ్యక్తి పేరు అజాద్ అహ్మద్​ దార్​ అని వెల్లడించారు.

అయితే ఉగ్రవాదాలు పౌరుడ్ని లక్ష్యంగా చేసుకుని ఎందుకు దాడి చేశారనే విషయం తెలియాల్సి ఉందని అధికారులు చెప్పారు.

ఇదీ చూడండి: ఎర్రకోట వద్ద లేజర్‌ కళ్ల నిఘా

ABOUT THE AUTHOR

...view details