తెలంగాణ

telangana

అక్టోబర్ 11, 12న భారత్​లో జిన్​పింగ్ పర్యటన

By

Published : Oct 9, 2019, 10:35 AM IST

చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్ పర్యటనపై అధికారిక ప్రకటన విడుదల చేసింది భారత విదేశాంగ శాఖ. అక్టోబర్ 11,12 తేదీల్లో చెన్నై వేదికగా ప్రధాని మోదీతో ఆయన సమావేశంగా కానున్నారని వెల్లడించింది.

అక్టోబర్ 11, 12న భారత్​లో జిన్​పింగ్ పర్యటన

చైనా అధ్యక్షుడు షీ జిన్​పింగ్ భారత పర్యటనను ఖరారు చేస్తూ అధికారిక ప్రకటన విడుదల చేసింది విదేశాంగ శాఖ. అక్టోబర్ 11, 12 తేదీల్లో జిన్​పింగ్ భారత్​లో పర్యటిస్తారని పేర్కొంది. ప్రధానమంత్రి నరేంద్రమోదీతో రెండో అనధికారిక సమావేశం చెన్నైకు సమీపంలోని మామళ్లపురం వేదికగా జరగనుందని వెల్లడించింది.

"ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఆహ్వానంపై.. చైనా అధ్యక్షుడు జిన్​పింగ్ చెన్నై రానున్నారు. చెన్నై వేదికగా ఇరునేతల మధ్య రెండో అనధికారిక సమావేశం జరగనుంది."

-విదేశాంగ శాఖ ప్రకటన

ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, ప్రాంతీయ, అంతర్జాతీయ స్థాయిలో సహకారంపై అగ్రనేతలు ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.
ఇద్దరు అగ్రనేతల మధ్య తొలి అనధికారిక సమావేశం చైనాలోని వుహాన్​ వేదికగా జరిగింది.

ఇదీ చూడండి: 'పోరాటం ఆగదు-రామమందిర నిర్మాణమే లక్ష్యం'

Madurai (Tamil Nadu), Oct 09 (ANI): As many as 108 women of different ages played veena at Meenakshi Amman Temple in Tamil Nadu's Madurai. The event took place to celebrate Vijaya Dashami. The festival of Dusshera was celebrated across the country on October 08.

ABOUT THE AUTHOR

...view details