తెలంగాణ

telangana

సోనియా ఎన్నికపై భాజపా వ్యంగ్యాస్త్రాలు

By

Published : Aug 11, 2019, 10:44 AM IST

కాంగ్రెస్​ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీని ఎన్నుకోవటంపై భాజపా వ్యంగ్యాస్తాలు సంధించింది. 'కాంగ్రెస్​కు ప్రేమతో..' అంటూ భాజపా నాయకుడు 7 క్షణాల నిడివిగల వీడియోను ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. అందులో ఓ మహిళ 'తల్లీకొడుకులకు జీవితాంతం బానిసలుగా కొనసాగండి' అంటూ సంభాషించారు.

సోనియా ఎన్నికపై భాజపా వ్యంగ్యాస్త్రాలు

మరోమారు గాంధీ-నెహ్రూ కుటుంబం నుంచే కాంగ్రెస్​ అధ్యక్ష పదవికి ఎంపిక చేయటాన్ని భారతీయ జనతాపార్టీ తీవ్రంగా విమర్శించింది. కాంగ్రెస్​ తాత్కాలిక అధ్యక్షురాలిగా యూపీఏ ఛైర్​పర్సన్​ సోనియా గాంధీని ఎన్నుకోవటంపై ట్విట్టర్​లో ఓ వీడియో పోస్ట్​ చేసింది.

సీడబ్ల్యూసీ సమావేశం అనంతరం సోనియా పేరును కాంగ్రెస్ ప్రకటించింది. ఆ తర్వాత భాజపా జాతీయ సమాచార, సాంకేతిక విభాగం ఇంఛార్జ్​​ అమిత్​ మాలవీయ ట్విట్టర్​లో కాంగ్రెస్​కు ప్రేమతో అంటూ 7 క్షణాల వీడియో సందేశాన్ని పంచుకున్నారు.

ఆ వీడియోలో ఓ మహిళ ' మీరు తల్లీకొడుకులకు జీవితాంతం బానిసలుగా కొనసాగండి' అంటూ సంభాషించారు.

కాంగ్రెస్​ అధ్యక్ష పదవికి రాహుల్​ గాంధీ రాజీనామా చేసి.. తదుపరి అధ్యక్షుడు గాంధీ కుటుంబేతరులు ఉంటారని పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో భాజపా విమర్శలు గుప్పించింది.

ఇదీ చూడండి: కాంగ్రెస్‌ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ

Aurangabad (Maharashtra), Aug 11 (ANI): Police rescued 23 cattle in a raid in Maharashtra's Aurangabad on August 10. The raid was conducted in Shahgunj area of Aurangabad. The cattle were also held hostage in that similar area. While speaking to media on this case, police official said, "We had received information that some cattle were held hostage, 23 cattle were rescued by police. Case has been registered and further investigation is underway in the case."

ABOUT THE AUTHOR

...view details