తెలంగాణ

telangana

నాజల్​ వ్యాక్సిన్​కు కేంద్రం అనుమతి.. అర్హులెవరు? ఎక్కడ పొందాలి?

By

Published : Dec 23, 2022, 2:14 PM IST

Updated : Dec 23, 2022, 5:32 PM IST

ప్రపంచవ్యాప్తంగా పలుదేశాల్లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో.. భారత్‌ బయోటెక్‌ అభివృద్ధి చేసిన నాసికా టీకా ఇన్‌కొవాక్‌కు కేంద్ర ఆరోగ్య శాఖ ఆమోదం తెలిపింది.

Bharat Biotech Intranasal Covid vaccine
నాసికా వ్యాక్సిన్​

Nasal Vaccine Covid: ప్రపంచవ్యాప్తంగా కొవిడ్ కేసులు పెరుగుతోన్న నేపథ్యంలో ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోవడానికి కేంద్రం అన్ని చర్యలు చేపడుతోంది. ఆసుపత్రుల్లో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ అధికారులకు అదేశాలు అందాయి. ఈ క్రమంలోనే దేశీయ ఫార్మా సంస్థ భారత్‌ బయోటెక్ అభివృద్ధి చేసిన రెండు చుక్కల నాసికా టీకాకు ఆమోదం తెలిపినట్లు శుక్రవారం కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రస్తుతం దేశం నిర్వహిస్తున్న టీకా కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నుంచి టీకా అందుబాటులో ఉండనుంది.

అసలేంటీ నాసికా వ్యాక్సిన్​?
దీన్ని భారత్​ బయోటెక్​ సంస్థ అభివృద్ధి చేసింది. ప్రస్తుతం అనేక దేశాల్లో ఈ మాదిరి నాసికా వ్యాక్సిన్​లు అందుబాటులో ఉన్నాయి. బీబీవీ-154 హెటిరోలాగస్‌ను అత్యవసర పరిస్థితుల్లో బూస‌్టర్‌ డోసుగా.. వినియోగించేందుకు గత నవంబర్‌లో డ్రగ్‌ కంట్రోలర్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా అనుమతి ఇచ్చింది.

ఎవరు అర్హులు
18ఏళ్లు పైబడినవారు ఈ నాసికా టీకాను బూస్టర్ డోసుగా తీసుకోవచ్చని పేర్కొంది.

ఎలా పనిచేస్తోంది..?
సాధారణ వ్యాక్సిన్​ల మాదిరిగానే ఇది పనిచేస్తోంది. భారత్​ బయోటెక్​ సంస్థ అభివృద్ధి చేసిన నాసికా టీకా ఇన్‌కొవాక్‌ను బూస్టర్​ డోస్​గా తీసుకోవచ్చు.

ఇతర వ్యాక్సిన్లతో పోలిస్తే తేడా ఏంటీ?
ఈ టీకా వైరస్‌ శరీరంలోకి ప్రవేశించే మార్గంలోనే (ముక్కులోనే) రోగనిరోధక ప్రతిస్పందనలు కలిగిస్తుంది. తద్వారా వైరస్‌ బారినపడకుండా కాపాడుకోవడమే కాకుండా ఇన్‌ఫెక్షన్‌, సంక్రమణ నుంచి పూర్తి రక్షణ పొందవచ్చు.

ఎలా తీసుకోవాలి?
ఈ నాజల్​ వ్యాక్సిన్​ను ముక్కు ద్వారా తీసుకోవాలి. ప్రస్తుతం దేశంలో ఉన్న సూదితో వేసే వ్యాక్సిన్​లకు బదులుగా చుక్కల ద్వారా ముక్కులో వేసే కొత్త రకం వ్యాక్సిన్​ను అందుబాటులోకి తెచ్చారు​.

ఎప్పటి నుంచి సామాన్యులకు అందుబాటులోకి వస్తుంది?
భారత ప్రభుత్వం దీన్ని మొదట ప్రైవేట్​ ఆస్పత్రిల్లో అందుబాటులోకి తీసుకువచ్చింది. శుక్రవారం సాయంత్రం నుంచి కొవిన్‌ ప్లాట్‌ఫాంలో అందుబాటులోకి వస్తుందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఆ తర్వాత కొవిడ్​ వ్యాక్సినేషన్​ ప్రోగ్రామ్​లో సామాన్యులకు అందుబాటులోకి తెస్తామని ప్రకటించింది.

Last Updated : Dec 23, 2022, 5:32 PM IST

ABOUT THE AUTHOR

...view details