తెలంగాణ

telangana

దిల్లీ మద్యం కేసు.. ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరు

By

Published : Feb 28, 2023, 8:15 PM IST

Updated : Feb 28, 2023, 9:41 PM IST

Bail Grants to Delhi Liquor Scam Accused: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన దిల్లీ మద్యం కుంభకోణంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. మద్యం కేసులో సీబీఐ నమోదు చేసిన కేసులో ఐదుగురు నిందితులకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Delhi Liquor Scam
Delhi Liquor Scam

Bail Grants to Delhi Liquor Scam Accused: దిల్లీ లిక్కర్ స్కామ్ వ్యవహారం దేశవ్యాప్తంగా సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. రోజుకో మలుపు తిరుగుతున్న మద్యం కుంభకోణంలో తాజాగా మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. దిల్లీ మద్యం కుంభకోణంలో అభియోగాలు ఎదుర్కొంటున్న ఐదుగురు నిందితులకు బెయిల్ మంజూరైంది. రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు మద్యం కేసులో సీబీఐ నమోదు చేసిన కేసులో ఐదుగురికి బెయిల్ మంజూరు చేసింది.

దిల్లీ లిక్కర్ స్కామ్​లో అభియోగాలు ఎదుర్కొంటున్న కుల్దీప్‌సింగ్, నరేంద్రసింగ్, అరుణ్ రామచంద్రన్ పిళ్లై, సమీర్ మహేంద్రు, ముత్తా గౌతమ్​లకు రౌస్ అవెన్యూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్, అరుణ్ రామచంద్రన్ పిళ్లై, ముత్తా గౌతమ్​లను అరెస్టు చేయకుండానే సీబీఐ ప్రత్యేక కోర్టు సాధారణ బెయిల్ ఇచ్చింది. వీరిలో అరుణ్ పిళ్లైను ఇటీవల ఈడీ ప్రశ్నించింది. ఈ మద్యం కుంభకోణానికి సంబంధించి ఈడీ నమోదు చేసిన కేసులో ముత్తా గౌతమ్ మినహా మిగతా నిందితులు జ్యుడిషియల్ రిమాండ్​లో ఉన్నారు.

సీబీఐ నమోదు చేసిన కేసులో నిందితులుగా ఉన్న విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లికి ఇప్పటికే సీబీఐ ప్రత్యేక కోర్టు బెయిల్ మంజూరు చేసింది. అయితే వీరిద్దరూ మాత్రం ఈడీ నమోదు చేసిన కేసులో ప్రస్తుతం జ్యుడిషియల్ రిమాండ్​లో ఉన్నారు. సీబీఐ నమోదు చేసిన కేసు తొలి ఛార్జ్ షీట్​లో మొత్తం ఏడుగురి నిందితులపై దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. సమీర్ మహేంద్రు, అభిషేక్ బోయినపల్లి, విజయ్ నాయర్, కుల్దీప్ సింగ్, నరేంద్ర సింగ్, అరుణ్ రామచంద్రన్ పిళ్లై, ముత్తా గౌతమ్ తొలి ఛార్జ్ షీట్​లో నిందితులుగా ఉన్నారు. ప్రస్తుతం ఎన్​ఫోర్స్​మెంట్ డైరెక్టరేట్(ఈడీ) కేసులో సమీర్ మహేంద్రు, విజయ్ నాయర్, అభిషేక్ బోయినపల్లి తీహార్ జైల్లో ఉన్నారు.

ఈ స్కామ్​లో సీబీఐ ఆదివారం దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్​ సిసోదియాను అరెస్ట్ చేసింది. ఈ కేసులో ఆయనపై సీీబీఐ చూపిన ఆధారాలు పరిశీలించిన న్యాయస్థానం వచ్చేనెల 4 వరకు కస్టడీ విధించింది. ఇవాళ సుప్రీంకోర్టులో వేసిన బెయిల్​ పిటిషన్​పై కూడా నిరాశ ఎదురైంది. బెయిల్ మంజూరు చేయాలన్న పిటిషన్​పై విచారణకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. హైకోర్టులోనే తేల్చుకోవాలని సూచించింది. ఈ పరిణామాల నేపథ్యంలో ప్రస్తుతం సీబీఐ కస్టడీలో ఉన్న దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా, ఆరోగ్య శాఖ మంత్రి సత్యేందర్ జైన్ తమ పదవులకు రాజీనామా చేశారు.

ఇవీ చదవండి:

Last Updated :Feb 28, 2023, 9:41 PM IST

ABOUT THE AUTHOR

...view details