తెలంగాణ

telangana

నాలుగోసారి గర్భం రావడం నచ్చక ఇంట్లోనే ప్రసవం- బిడ్డ మృతి, తల్లి అరెస్టు

By

Published : Dec 8, 2021, 1:07 PM IST

Baby delivery at home Coimbatore: పిల్లల్ని కనేందుకు ఇష్టపడని ఓ మహిళ.. ప్రసవం సమయంలో ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరించింది. దీంతో ఇంట్లోనే ప్రసవించగా.. మృత శిశువు జన్మించింది. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు.. ఆ మహిళను అరెస్టు చేశారు.

Mother arrested for attempting delivery at home
Mother arrested for attempting delivery at home

Baby delivery at home Coimbatore:తమిళనాడు కోయంబత్తూరుకు చెందిన ఓ మహిళ ఇంట్లోనే ప్రసవించింది. పురిటినొప్పులు వచ్చినా.. ఆస్పత్రికి వెళ్లేందుకు నిరాకరించిన మహిళ.. తన బిడ్డను పోగొట్టుకుంది.

Mother arrested for delivery at home

పున్నియావతి, విజయ్​కుమార్ దంపతులు జిల్లాలోని ఉప్పుకార ప్రాంతంలో నివసిస్తున్నారు. వీరికి ముగ్గురు సంతానం. మరోసారి గర్భం దాల్చింది పున్నియావతి. అయితే గర్భంపై పున్నియావతి సంతోషంగా లేదు. దీంతో బిడ్డను కనేందుకు అనాసక్తి ప్రదర్శించింది. అందుకే నొప్పులు వచ్చినా ఆస్పత్రికి వెళ్లకుండా ఉండిపోయింది. ఇంట్లోనే ప్రసవించేందుకు ప్రయత్నించి.. మృత శిశువుకు జన్మనిచ్చింది. బొడ్డుతాడు విచ్ఛేదనం సరిగా జరగకపోవడం వల్ల మగబిడ్డ ప్రాణాలు కోల్పోయాడు.

ఈ విషయంపై సమాచారం అందుకున్న పెరియకడాయ్ పోలీసులు.. దంపతులను విచారించారు. అనంతరం పున్నియావతిని సెక్షన్ 315 కింద అరెస్టు చేశారు.

ఇదీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details