తెలంగాణ

telangana

ఘనంగా సైనిక దినోత్సవం- అమరులకు త్రివిధ దళాల సలాం

By

Published : Jan 15, 2022, 12:12 PM IST

Army Day, ఆర్మీ డే

Army day 2022: భారత సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకుని దిల్లీలోని యుద్ధ స్మారకం వద్ద నివాళులు అర్పించారు త్రివిధ దళాల సారథులు. దేశం కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరులను స్మరించుకున్నారు. అనంతరం కరియప్ప పరేడ్​ గ్రౌండ్​లో ఘనంగా నిర్వహించిన కవాతులో పాల్గొన్నారు.

Army day 2022: దేశ రాజధాని దిల్లీలోని జాతీయ యుద్ధ స్మారకం వద్ద ఘన నివాళులు అర్పించారు భారత సాయుధ దళాల అధిపతులు. సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశం కోసం ప్రాణాలు పణంగా పెట్టిన అమరుల త్యాగాలను స్మరించుకున్నారు. గౌరవవందనం చేసి పుష్పగుచ్చం సమర్పించారు. భారత సైన్యాధిపతి ఎంఎం నరవణె, వాయుసేన చీఫ్​ వీఆర్ చౌదరి, నేవీ సారథి ఆర్ హరికుమార్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అమరులకు సెల్యూట్ చేస్తున్న త్రివిధ దళాల సారథులు
జాతీయ యుద్ధ స్మారకానికి పుష్పగుచ్చంతో నివాళులు అర్పిస్తున్న సాయుధ దళాల సారథులు

అనంతరం కరియప్ప పరేడ్​ గ్రౌండ్​లో ఏర్పాటు చేసిన కవాతులో పాల్గొన్నారు త్రివిధ దళాల సారథులు. ఘనంగా ఆర్మీ డే వేడుకలు నిర్వహించారు. సైన్యంలో విధులు నిర్వహిస్తూ ప్రాణాలు కోల్పోయిన అమరుల కుటుంబాలకు పతకాలు అందజేశారు.

భారత త్రివిధ దళాల సారథులు

అంతకుముందు రాష్ట్రపతి రామ్​నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ సైనిక దినోత్సవం సందర్భంగా ఆర్మీకి శుభాకాంక్షలు తెలిపారు. వీరుల త్యాగాలను దేశం ఎన్నటికీ మరువదని కొనియాడారు.

అగ్గిపుల్లలతో యుద్ధ ట్యాంక్​..

ఆర్మీ డే సందర్భంగా ఒడిశాకు చెందిన సస్వత్ రంజన్​ సాహు T-90 యుద్ధ ట్యాంకు కళాకృతిని రూపొందించాడు. 1,774 అగిపుల్లలతో ఈ సూక్ష కళాకండాన్ని రూపొందించాడు. అమర జవాన్లకు నివాళిగా దీన్ని రూపొందించినట్లు చెప్పాడు.

అగ్గిపుల్లలతో ఆర్మీ ట్యాంకర్​ రూపొందించిన ఒడిశా కళాకారుడు
అగ్గిపుల్లలతో ఆర్మీ ట్యాంకర్​ రూపొందించిన ఒడిశా కళాకారుడు
అగ్గిపుల్లలతో ఆర్మీ ట్యాంకర్​ రూపొందించిన ఒడిశా కళాకారుడు

750 మీటర్ల కాగితపు చుట్ట

సైనిక దినోత్సవాన్ని పురస్కరించుకుని అరుదైన వర్క్​షాప్​ నిర్వహించింది నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్​. కళా కుంభ్ పేరుతో 750 మీటర్ల పరిమాణంలో ఉన్న భారీ స్క్రోల్స్​ను(కాగితపు చుట్టలు) ప్రదర్శించింది. భారత స్వాతంత్ర్యోద్యమ సమయంలో పోరాడిన వీరుల కథలను వివరించేలా దీన్ని రూపొందించారు.

సైనిక దినోత్సవాన్ని పురస్కరించిన భారీ కాగితపు చుట్ట
సైనిక దినోత్సవాన్ని పురస్కరించిన భారీ కాగితపు చుట్ట
సైనిక దినోత్సవాన్ని పురస్కరించిన భారీ కాగితపు చుట్ట

అతిపెద్ద జాతీయ పతాకం..

భారత్​-పాక్ సరిహద్దులో అతిపెద్ద ఖాదీ త్రివర్ణ పతాకం ప్రదర్శన

ఆర్మీ డే సందర్భంగా ఖాదీతో తయారు చేసిన, ప్రపంచంలోనే అతిపెద్ద జాతీయ పతాకమైన మువ్వన్నెల జెండాను భారత్​-పాక్ సరిహద్దు ప్రాంతం జైసల్మేర్​లో ప్రదర్శించారు. గతేడాది అక్టోబర్​ 2న గాంధీ జయంతి సందర్భంగా లేహ్​లో దీన్ని ఆవిష్కరించారు. అప్పటినుంచి అరుదైన సందర్భాల్లో ఇప్పటివరకు ఐదు సార్లు ప్రదర్శించారు.

ఇదీ చదవండి:సాహో సైనికా.. నీ తెగువకు సాటిరారెవరైనా..!

ABOUT THE AUTHOR

...view details