తెలంగాణ

telangana

Amrit Kalash Yatra Delhi : 'అమృతకాల యాత్ర ప్రారంభిద్దాం.. అభివృద్ధి చెందిన దేశంగా ఎదుగుదాం'.. మహాయజ్ఞంలో మోదీ

By ETV Bharat Telugu Team

Published : Oct 31, 2023, 6:26 PM IST

Updated : Oct 31, 2023, 7:10 PM IST

Amrit Kalash Yatra Delhi : స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు ముగిసిన నేపథ్యంలో.. దేశప్రజలంతా అమృతకాల యాత్రను ప్రారంభించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మేరీ మాటి మేరా దేశ్ కార్యక్రమం ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్న మోదీ.. అమృత్ కలశ్ యాత్రలో భాగంగా దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి తెచ్చిన మట్టిని నుదుటికి తిలకంగా దిద్దుకున్నారు. కర్తవ్యపథ్​లో ప్రస్తుతం మహాయజ్ఞం జరుగుతోందని అన్నారు.

Amrit Kalash Yatra Delhi
Amrit Kalash Yatra Delhi

Amrit Kalash Yatra Delhi : దేశ మాజీ హోంమంత్రి సర్దార్ వల్లభ్​భాయ్ పటేల్ జయంతి సందర్భంగా దిల్లీలోని కర్తవ్యపథ్​లో మహాయజ్ఞం జరుగుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసినవారిని స్మరించుకునేందుకు చేపట్టిన 'మేరీ మాటి మేరా దేశ్' కార్యక్రమం ముగింపు కార్యక్రమంలో మోదీ పాల్గొన్నారు. దిల్లీలోని కర్తవ్యపథ్​లో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమంతో స్వాతంత్ర్య అమృత మహోత్సవాలు ( Azadi Ka Amrit Mahotsav ) ముగియనున్న నేపథ్యంలో.. దేశప్రజలంతా 'అమృతకాల' యాత్రను ప్రారంభించాలని మోదీ పిలుపునిచ్చారు. 2047 నాటికి భారత్​ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చుకునేందుకు కృషి చేయాలని కోరారు.

"దండి యాత్ర సమయంలో ప్రజలు ఎలాగైతే ఏకమయ్యారో, స్వాతంత్ర్య అమృత మహోత్సవాల సమయంలోనూ అలాగే ఒక్కటయ్యారు. అన్ని ప్రాంతాలకు చెందినవారంతా స్వాతంత్ర్య సంగ్రామంలో పాల్గొన్న విధంగానే.. అమృత్ మహోత్సవ్ కార్యక్రమం అందరి వేడుకలా సాగింది. భారీగా ప్రజలు భాగస్వామ్యం కావడం వల్ల ఈ కార్యక్రమం సరికొత్త చరిత్ర సృష్టించింది. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమయంలో భారత్.. అనేక చారిత్రక విజయాలు నమోదు చేసింది. చంద్రయాన్-3 విజయం, వందేభారత్ రైళ్ల ప్రారంభం, దేశం ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా మారడం వంటి పరిణామాలు ఈ సమయంలోనే జరిగాయి."
-నరేంద్ర మోదీ, ప్రధానమంత్రి

'మేరా యువ భారత్' లాంఛ్
అమృత్ కలశ్ యాత్రలో భాగంగా దేశవ్యాప్తంగా వేలాది గ్రామాల నుంచి తీసుకొచ్చిన మట్టిని నుదుటికి తిలకంగా దిద్దుకున్నారు మోదీ. ఈ సందర్భంగా దేశంలోని యువత కోసం ఉద్దేశించిన 'మేరా యువ భారత్' ( MY Bharat platform ) వేదికను ప్రధాని ప్రారంభించారు. 21వ శతాబ్దిలో దేశాభివృద్ధికి మేరా మేరా భారత్ యువ సంస్థ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. దేశంలోని యువత తమ లక్ష్యాలను కలిసికట్టుగా ఎలా సాధిస్తారో చెప్పేందుకు మేరీ మాటి మేరా దేశ్ కార్యక్రమం ఓ ఉదాహరణ అని పేర్కొన్నారు.

'మోదీ ఆలోచనతోనే..'
7500 గ్రామాల నుంచి దిల్లీకి మట్టిని తీసుకొచ్చినట్లు కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. సర్దార్ పటేల్ జయంతి రోజున ఈ కార్యక్రమం జరుపుకోవడంపై సంతోషం వ్యక్తం చేశారు. దేశం కోసం పోరాడిన యోధులను స్మరించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి మట్టిని తీసుకురావాలన్నది మోదీ ఆలోచనే అని మరో కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు.

PM Modi Speech National Unity Day : 'దేశంలో బుజ్జగింపు రాజకీయాలు.. ఆర్టికల్ 370 వల్లే జమ్ముకశ్మీర్​లో ప్రశాంత వాతావరణం'

Swachhata Hi Seva 2023 : దేశవ్యాప్తంగా 'స్వచ్ఛతా హీ సేవా' కార్యక్రమం.. చీపుర్లు పట్టి గంటపాటు శ్రమదానం.. కేంద్రమంత్రులు సైతం..

Last Updated :Oct 31, 2023, 7:10 PM IST

ABOUT THE AUTHOR

...view details