తెలంగాణ

telangana

నటి ఖుష్బూ ట్విట్టర్ ఖాతా హ్యాక్

By

Published : Jul 20, 2021, 2:31 PM IST

ప్రముఖ సినీ నటి ఖుష్బూ సుందర్​ ట్విట్టర్​ ఖాతాను సైబర్​ కేటుగాళ్లు హ్యాక్​ చేశారు. మూడు రోజుల క్రితం తన ఖాతా హ్యాకైందని.. సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఖుష్బూ పేర్కొన్నారు.

kushboo sundar twitter, kushboo sundar twitter hack
నటి ఖుష్బూ ట్విట్టర్ ఖాతా హ్యాక్

ప్రముఖ సినీ నటి, భాజపా నేత ఖుష్బూ సుందర్ ట్విట్టర్​ ఖాతా హ్యాకైంది. మూడు రోజుల క్రితం తన ఖాతాను ఎవరో హ్యాక్​ చేశారని, ట్విట్టర్​ను సంప్రదించి సమస్య పరిష్కరించుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు ఆమె ఓ ప్రకటన ద్వారా తెలిపారు. ఈ 3 రోజుల్లో ఆ ఖాతా నుంచి వచ్చిన ట్వీట్లతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు ఖుష్బూ. ట్విట్టర్​ ఖాతాపై తమిళనాడు డీజీపీని స్వయంగా కలిసి, ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.

హ్యాక్​కు గురైన ఖుష్బూ ఖాతా

ఖుష్బూకు ట్విట్టర్​లో 13 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. సైబర్ కేటుగాళ్లు ఆమె ఖాతాను హ్యాక్ చేసి, పేరు, ప్రొఫైల్ పిక్ మార్చారు. కొన్ని అనుచిత ట్వీట్లు చేశారు.

ఇదీ చదవండి :భారత్‌లో తొలి డబుల్ ఇన్ఫెక్షన్ కేసు

ABOUT THE AUTHOR

...view details