తెలంగాణ

telangana

కాటేసిన పామును ఆస్పత్రికి తీసుకెళ్లిన యువకుడు.. చేతిలో పట్టుకుని..

By

Published : Dec 29, 2022, 9:16 AM IST

Updated : Dec 29, 2022, 9:35 AM IST

తనను కాటేసిన పామును చేతిలో పట్టుకుని ఏకంగా ఆస్పత్రికే తీసుకెళ్లాడు ఓ యువకుడు. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది.

A young man came to the hospital with a snake
A young man came to the hospital with a snake

పాము కాటు వేస్తే ఎవరైనా దాన్ని కొట్టి చంపేస్తారు. లేదంటే అక్కడ నుంచి దూరంగా పారిపోతారు. వెంటనే ఆస్పత్రికి వెళ్తారు. అయితే కర్ణాటకలోని చిక్కమగళూరులో తరికెరె నగరంలో ఓ యువకుడు మాత్రం విభిన్నంగా ఆలోచించాడు. తనను కరిచిన పామును చేతిలో పట్టుకుని ఆస్పత్రికి తీసుకెళ్లాడు.

ఇదీ జరిగింది..
కోల్‌కతాకు చెందిన ఆసిఫ్ అనే యువకుడు.. జాతీయ రహదారి నిర్మాణ పనులు చేసేందుకు కర్ణాటకకు వచ్చాడు. స్వగ్రామానికి తిరిగి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. రైల్వేస్టేషన్​కు వెళ్లే ఆ సమయంలో అతడికి పాము కాటు వేసింది. వెంటనే ఆస్పత్రికి వెళ్లమని స్థానికులు సూచించారు. కానీ అతడు మాత్రం తనను కాటేసిన పామును చేతిలో పట్టుకుని ఆస్పత్రికి వెళ్లాడు. చేతిలో పాము ఉండడం చూసి ఆస్పత్రి సిబ్బంది షాక్‌కు గురయ్యారు. అనంతరం ఆసిఫ్‌కు చికిత్స అందించారు.

కాటేసిన పామును ఆస్పత్రికి తీసుకెళ్లిన యువకుడు.. చేత్తో పట్టుకుని..

కవర్​లో పామును తీసుకెళ్లిన రైతు..
కొద్దిరోజుల క్రితం.. ఒడిశాలోని బాలాసోర్​లో ఇలాంటి ఘటనే జరిగింది. భగవత్ ప్రధాన్ అనే రైతు తన పొలంలో కూరగాయలు కోయడానికి వెళ్లాడు. అప్పుడు అతడికి పాము కాటు వేసింది. వెంటనే భగవత్ తన బంధువును కర్ర పట్టుకుని రమ్మన్నాడు. ఇద్దరు కలిసి పాముని కర్రతో ఒడిసి పట్టుకున్నారు. తర్వాత పాలిథీన్​ కవర్​లో పెట్టి.. బాలాసోర్ మెడికల్‌ ఆస్పత్రికి చేరుకున్నారు. వీరి దగ్గర పామును చూసి ఆస్పత్రిలోని వైద్యులు, రోగులు, వారి బంధువులు భయాందోళనకు గురయ్యారు. వైద్యులు చికిత్స అనంతరం భగవత్ కోలుకుంటున్నాడని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు.

Last Updated : Dec 29, 2022, 9:35 AM IST

ABOUT THE AUTHOR

...view details