తెలంగాణ

telangana

పుస్తకాలు చదివి సేద్యం.. రోజుకు రూ.1500 సంపాదన!

By

Published : Mar 8, 2021, 9:09 AM IST

పుస్తకాలు చదివి ప్రకృతి సేద్యం చేసి కర్ణాటకకు చెందిన ప్రభామణి అనే మహిళ రోజుకు రూ.1500 సంపాదిస్తోంది. పుస్తకాలు చదివి సేద్యం చేయడమేంటని అనుకుంటున్నారా? అయితే ఈ కథనం చదివాల్సిందే..

A woman earns Rs 1500 per day in agriculture by reading books
పుస్తకాలు చదివి..రోజుకు రూ.1500సంపాదిస్తోన్న మహిళ

పుస్తకాలు చదివి సేద్యం.. రోజుకు రూ.1500 సంపాదన!

వారికున్న ఐదు ఎకరాలలో ఒకే రకమైన పంటను వేసి తీవ్రంగా నష్టపోయారు. దాంతో తమ పొలాన్ని లీజుకిచ్చి కూలీ పనులకు వెళ్లారు. కానీ ఆ మహిళా రైతు.. సోదరుడు ఇచ్చిన సలహాతో ఆమె దశ తిరిగింది. ఇప్పడు ప్రకృతి సేద్యం చేస్తూ లాభాలు గడిస్తోంది.

ఎలా..?

కర్ణాటకలోని చామరాజ్​నగర్​కు చెందిన ప్రకాశ్​కు 5 ఎకారల పొలం ఉంది. అందులో చాలా కాలంగా ఒకే రకమైన పంట వేసి నష్టపోయాడు. దాంతో పొలాన్ని లీజుకిచ్చి ప్రకాశ్​ ఆయన భార్య ప్రభామణి ఇద్దరూ కూలీ పనులకు వెళ్లారు. 5 ఎకారలుండి కూలీకి పోవడమేంటని ప్రభామణి సోదరుడు ఆమెతో అన్నాడు. ప్రకృతి వ్యవసాయనికి సంబంధించిన కొన్ని పుస్తకాల్ని, యూట్యూబ్​ లింకులను ఆమెకు పంపించాడు. దాంతో ఆమె ఆ పుస్తాకాల్ని చదివి.. సొంత పొలంలోనే ప్రకృతి వ్యవసాయం చేస్తోంది. మొదట కొన్ని సమస్యల్ని ఎదుర్కొన్నా.. ప్రస్తుతం రోజుకు రూ.1500ల మేర లాభాల్ని గడిస్తున్నారు.

"ప్రకృతి సేద్యానికి సంబంధించిన పుస్తకాల్ని, యూట్యూబ్​ లింక్​లను నా సోదరుడు పంపించాడు. ఆ పుస్తకాలు చదివి మా పొలంలోనే ప్రకృతి సేద్యాన్ని చేస్తున్నాం. మొదట ఇబ్బంది పడ్డాం. ఇప్పుడు ప్రకృతి సేద్యం చేస్తూ లాభపడుతున్నాం. మొదట్లో చాలామంది తమని చూసి హేళన చేసేవారు. కానీ ఇప్పుడు వారే ప్రకృతి సేద్యం చేస్తున్నారు."

-ప్రభామణి, మహిళా రైతు

ఆమె తల్లిదండ్రులు, భర్త వ్యవసాయం చేయడంలో సాయపడుతున్నారు. ఇదివరకు ఒకే రకమైన పంటను వేసేవారు.. ఇప్పడు 20 రకాల కూరగాయల్ని పది ఎకారాలలో ప్రకృతి సేద్యం ద్వారా పండిస్తున్నారు. అంతేకాకుండా చెరకు లాంటి వాణిజ్య పంటల్ని పండిస్తున్నారు.

"ఒకేరకమైన పంటను వేసి చాలా తప్పు చేశాం. అందువల్ల చాలా నష్టపోయాం. మా బావమరిది ఇచ్చిన సలహా మేరకు ప్రకృతి సేద్యం ద్వారా మిశ్రమ పంటల్ని పండిస్తున్నాం."

-ప్రకాశ్​, రైతు

మొదట ప్రకృతి వ్యవసాయం చేస్తున్న వీరిని చూసి నవ్విన వారే.. ఇప్పుడు ఈ సాగు గురించి అడిగి తెలుసుకుంటున్నారు.

ఇదీ చూడండి:నాలుగేళ్ల చిన్నారి.. ప్రతిభకు సాటేది!

ABOUT THE AUTHOR

...view details