తెలంగాణ

telangana

సూపర్​ సోలార్​ కార్.. పైసా ఖర్చు లేకుండా జర్నీ.. మ్యాథ్స్ టీచర్ ఐడియా అదుర్స్!

By

Published : Jun 23, 2022, 7:04 PM IST

Solar Car
Solar Car ()

Solar Car: జమ్ముకశ్మీర్​కు చెందిన ఓ గణిత ఉపాధ్యాయుడు.. తన అద్భుతమైన ప్రతిభతో సోలార్​ కారును రూపొందించారు. రాబోయే పదేళ్లలో మరింతగా ఇంధన ధరలు పెరుగుతాయనే ముందస్తు ఆలోచనతో ఈ కారును తయారు చేశారు. దాదాపు 13 ఏళ్లు కష్టపడి ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. పదండి మరి.. ఆ సోలార్​ కారు విశేషాలను తెలుసుకుందాం.

సూపర్​ సోలార్​ కార్.

Solar Car: ఇంధన ధరలు సామాన్యుల పాలిట అంతకంతకూ భారంగా మారుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలతో ఇటీవల కాలంలో ఎలక్ట్రికల్ వాహనాలకు డిమాండ్ బాగా పెరిగిపోతోంది. ఈవీలను ప్రభుత్వాలు సైతం ప్రోత్సహించడం వల్ల ఎక్కువ మంది వినియోగదారులు వాటిపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే ఈవీలు నడవాలంటే బ్యాటరీలను కచ్చితంగా ఛార్జ్‌ చేయాల్సిందే. అయితే ఆ ఖర్చు కూడా లేకుండా.. మనకు ఉచితంగా లభించే సూర్యకిరణాల శక్తితో నడిచే సోలార్​ కారును తయారు చేశారు కశ్మీర్​కు చెందిన ఓ గణిత ఉపాధ్యాయుడు.

సోలార్​ కార్​ ఫ్రంట్​ వ్యూ

శ్రీనగర్‌లోని సనత్ నగర్ ప్రాంతానికి చెందిన గణిత ఉపాధ్యాయుడు, ఇంజనీర్ బిలాల్ అహ్మద్ మీర్.. 15 లక్షల రూపాయలకుపైగా వ్యయంతో సౌరశక్తితో నడిచే కారును రూపొందించారు. అందుకోసం కొన్ని సంవత్సరాల పాటు అధ్యయనం చేశారు. 2009లో తన దగ్గర ఉన్న నిస్సాన్ మైక్రా 1998 మోడల్ కారును సోలార్​ కారుగా తీర్చిదిద్దాలని నిర్ణయించుకున్నారు. 13 ఏళ్ల క్రితం ఈ కారుకు సంబంధించిన పనులను మొదలుపెట్టిన మీర్​.. ఇటీవల పూర్తి చేశారు. కారు తయారీకి కావలసిన విడిభాగాలు జమ్ముకశ్మీర్​లో దొరకలేదని.. వాటికోసం దేశంలో అనేక ప్రాంతాలకు వెళ్లి మరీ తీసుకొచ్చారు. ఆటోమొబైల్ డిజైన్ నిపుణుల సలహాలను కూడా తీసుకుని తీసుకుని.. అనుకున్న లక్ష్యం సాధించారు బిలాల్.

సోలార్​ కార్​తో అహ్మద్​ మీర్​

" నేను ఈ ప్రాజెక్టును 2009లో మొదలు పెట్టాను. నా దగ్గర ఉన్న నిస్సాన్​ మైక్రా 1998 మోడల్​ కారు ఉంది. అది పెట్రోల్​ కారు. మొదట దానిని ఎలక్ట్రికల్​ కారుగా మోడిఫై చేశాను. ఆ తర్వాత నాకు సోలార్​ కారు గురించి తెలిసింది. అప్పుడు ఎలా చేయాలో వివిధ అధ్యయనాల ద్వారా తెలుసుకున్నాను. కారు పైకప్పుపై సౌర​ పలకలు ఏర్పాటు చేసి సోలార్ కారుగా రూపొందించాను. దీంతో కారు పార్క్​ చేసిన సమయంలోనూ సూర్య కిరణాల ద్వారా బ్యాటరీ ఛార్జ్​ అవుతుంది. దీన్ని తయారు చేయడానికి ఎంతో కష్టపడ్డాను."

-- బిలాల్ అహ్మద్ మీర్, సోలార్​ కార్ రూపకర్త

కశ్మీర్​లో వాతావరణం చాలా వరకు అస్థిరంగా ఉంటుందని, అలాంటి ప్రదేశంలో తాను సోలార్​ వాహనం తయారు చేసి ఉపయోగించడం అదృష్టంగా భావిస్తున్నానని మీర్​ తెలిపారు. "నేను తయారు చేసిన ఈ సోలార్​ కారులో గుల్​వింగ్​ డోర్లను ఏర్పాటు చేశాను. కారు పైభాగంలో ఏర్పాటు చేసిన సౌలార్​ ప్లేట్లపై పడే మంచును తొలగించడానికి రిమోట్​ కంట్రోల్​ మిషన్​ను అమర్చాను. ఈ కారులో లెడ్​ యాసిడ్​ బ్యాటరీని ఉపయోగించాను. కావాలంటే లిథియం బ్యాటరీలను కూడా వాడొచ్చు." అని మీర్​ చెప్పుకొచ్చారు. పర్యటక ప్రాంతమైన కశ్మీర్​లో తన సోలార్​ కారు ఆకర్షణీయంగా కనిపించాలని ఎంతో కష్టపడి తయారు చేశానని మీర్​ తెలిపారు.

సాలార్​ కార్​ బ్యాక్​ వ్యూ

ఇవీ చదవండి:జీవచ్ఛవంలా చిన్నారి.. దేవుడి​పైనే ఆశలు.. ఈటీవీ భారత్​ కథనంతో...

కొంపముంచిన పిల్లాడు.. తండ్రి ఫోన్​లో ఆన్​లైన్ గేమ్.. రూ.39 లక్షలు గోవింద!

ABOUT THE AUTHOR

...view details