తెలంగాణ

telangana

అల్లుడి ఘాతుకం.. పెళ్లైన రెండు వారాల్లోనే భార్య, అత్త హత్య

By

Published : Mar 14, 2023, 4:29 PM IST

Murder of Mother and Daughter: కర్నూలులో ఓ అల్లుడు ఘాతుకానికి పాల్పడ్డాడు. స్థానిక చింతలముని నగర్‌కు చెందిన శ్రావణ్‌ అతని తల్లిదండ్రులతో కలిసి.. భార్యతో సహా అమె తల్లిని కిరాతకంగా కడతేర్చారు. ప్రసాద్, కృష్ణవేణి దంపతుల కుమారుడు శ్రావణ్ కు ఈనెల 1న రుక్మిణితో పెళ్లి జరిగింది. రుక్మిణి ఆమె తల్లిదండ్రులతో కలిసి కర్నూలోని శ్రావణ్‌ ఇంటికి వచ్చిన కొన్ని గంటల్లోనే ఈ దారుణం చోటుచేసుకుంది.

Murder
హత్య

Murder of Mother and Daughter: అబ్బాయి బ్యాంకులో పని చేస్తున్నాడు. దీంతో వాళ్ల అమ్మాయిని ఎంతో మంచిగా.. ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాడని అనుకున్నారు. అల్లారుముద్దుగా పెంచుకున్న తమ కుమార్తెను ఆ అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేయాలని నిశ్చయించారు. అనుకున్న విధంగానే రోజుల్లోనే ఆ బ్యాంకులో పని చేస్తున్న అబ్బాయికి ఇచ్చి పెళ్లి చేశారు. వాళ్లిద్దరికీ ఈ నెల ఒకటవ తేదీన కుమార్తె వాళ్ల ఇంటి దగ్గరే పెళ్లి అయింది. తమ కుమార్తె పెళ్లి అంతా సక్రమంగా ఎటువంటి ఇబ్బందులు లేకుండా జరిగినందుకు.. ఆ తల్లిదండ్రులు ఎంతో సంతోషపడ్డారు.

కాగా ఈ రోజు తమ కుమార్తెను అత్తవారింటికి తీసుకొచ్చారు. కుమార్తెతో పాటు తల్లిదండ్రులు కూడా వచ్చారు. ఇప్పటివరకూ అంతా బాగానే ఉంది. ఇక్కడే అసలైన ట్విస్ట్ చోటు చేసుకుంది. ఇంట్లో నుంచి ఒక్కసారిగా అరుపులు వినిపించాయి.. ఏదో గొడవ జరుగుతుందని ఇరుగు పొరుగు వాళ్లు అనుకున్నారు.. కానీ వాళ్లకు కూడా ఏం జరుగుతుందో సరిగ్గా తెలియలేదు.

తీరా కొద్ది క్షణాల్లో.. వాళ్లకు తెలిసేలోపే ఘోరం జరిగిపోయింది. కట్టుకున్న భర్త శ్రావణ్.. భార్యను, భార్య తల్లిని అత్యంత కిరాతకంగా చంపేశాడు.. ఇంత జరుగుతున్నా.. శ్రావణ్​ను తల్లిదండ్రులు అస్సలు ఆపలేదు. తమ కుమారుడు చేస్తున్నది తప్పు అని మందలించాల్సిన వాళ్లే.. అతనికి సహకరించారు.

అల్లుడి ఘాతుకం.. పెళ్లైన రెండు వారాల్లోనే.. భార్యను, అత్తను

ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు: కర్నూలు నగరంలోని చెన్నమ్మ సర్కిల్ వద్దనున్న చింతలముని నగర్​కు చెందిన ప్రసాద్, అతని కుటుంబ సభ్యులు కిరాతకంగా కత్తితో తల్లి, కుమార్తెను చంపారు. ప్రసాద్​-కృష్ణవేణి దంపతుల కుమారుడు శ్రావణ్​కు ఈనెల 1న తెలంగాణ రాష్ట్రం వనపర్తికి చెందిన రుక్మిణితో వివాహం అయ్యింది.

ఈ రోజు ఉదయం వనపర్తి నుంచి రుక్మిణి, తల్లి రమాదేవి, తండ్రి వెంకటేష్.. ముగ్గురు కర్నూలులోని భర్త శ్రావణ్ ఇంటికి వచ్చారు. వచ్చిన కొన్ని గంటల్లోపే ఇంట్లో గొడవ ప్రారంభమైంది. దీంతో ఆ గొడవ కాస్తా పెద్దది అయ్యి.. హత్యలకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో రుక్మిణి, రమాదేవి దారుణంగా హత్యకు గురయ్యారు. రుక్మిణి తండ్రికి తీవ్ర గాయాలు కాగా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసును నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. శ్రావణ్ బ్యాంకులో పని చేస్తున్నాడు. హత్యలకు కారణమైన ప్రసాద్, శ్రావణ్, కృష్ణవేణి పోలీసుల అదుపులో ఉన్నారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details