తెలంగాణ

telangana

19వేల అడుగుల పర్వతాలు ఎక్కిన చిన్నారి.. ఆరున్నరేళ్ల వయసులోనే అరుదైన ఘనత

By

Published : Mar 4, 2023, 5:42 PM IST

6 YEAR OLD GIRL MADE A WORLD RECORD
6 YEAR OLD GIRL MADE A WORLD RECORD

ఆరున్నరేళ్ల వయసులోనే దక్షిణాఫ్రికాలోని 19,000 అడుగుల ఎత్తున్న కిలిమంజారో, మేరూ పర్వత శిఖరాలను అధిరోహించింది సియెన్నా చోప్రా. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ సాధించని విధంగా శిఖర ద్వయాన్ని ఒక వారంలోనే అధిరోహించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది.

19వేల అడుగుల పర్వతాలు ఎక్కిన చిన్నారి.. ఆరున్నరేళ్ల వయసులోనే అరుదైన ఘనత

పంజాబ్​లోని లుథియానాకు చెందిన ఆరున్నరేళ్ల చిన్నారి అరుదైన ఘనత సొంతం చేసుకుంది. దక్షిణాఫ్రికాలోని 19,000 అడుగుల ఎత్తున్న కిలిమంజారో, మేరూ పర్వత శిఖరాలను సియెన్నా చోప్రా అధిరోహించింది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఎవరూ సాధించని విధంగా శిఖర ద్వయాన్ని ఒక వారంలోనే అధిరోహించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తింది. అవాంతరాలు ఎదురైన.. బెదరక పర్వత శిఖరాన్ని చేరుకుని.. అక్కడ మువ్వన్నెల జెండాను ఎగురవేసింది. తమ చిన్నారి ప్రపంచ రికార్డు నెలకొల్పడం పట్ల సియెన్నా తల్లిదండ్రులు ఆనందం వ్యక్తం చేశారు. అతి చిన్న వయసులో 39 గంటల్లోనే సాహసోపేతంగా పర్వతారోహణ చేపట్టిన సియెన్నా చోప్రాను స్థానిక ఎమ్మెల్యే అభినందించారు.

కిలిమంజారో పర్వతంపై సియెన్నా
కిలిమంజారో పర్వతంపై త్రివర్ణ పతాకంతో సియెన్నా

5,685 మీటర్ల ఎత్తున్న కిలిమంజారో పర్వతాన్ని ఎక్కిన తొమ్మిదేళ్ల రిత్వికశ్రీ
అంతకుముందు.. ఆఫ్రికా ఖండంలోని కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా తాడిమర్రి మండలం ఎం.అగ్రహారం గ్రామానికి చెందిన తొమ్మిదేళ్ల రిత్వికశ్రీ. 5,895 మీటర్ల ఎత్తున్న కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించింది. 7 రోజుల పాటు ఈ ప్రయాణం సాగిందని రిత్వికశ్రీ తండ్రి కడపల శంకర్‌ తెలిపారు. ఆసియా ఖండం నుంచి చిన్నవయసులో కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించిన మొదటి వ్యక్తిగా రిత్వికశ్రీ రికార్డులకెక్కగా.. ప్రపంచంలో రెండో స్థానంలో నిలిచిందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా బాలికకు అభినందనలు వెల్లువెత్తుతున్నాయి.

ప్రధాని నుంచీ అభినందనలు
ఏడేళ్లు కూడా నిండకుండానే ఆఫ్రికాలోనే ఎత్తైన కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించి చరిత్ర సృష్టించాడు తెలుగు కుర్రాడు. తల్లిదండ్రులకే కాకుండా.. పుట్టి పెరుగుతున్న తెలంగాణ రాష్ట్రానికీ గర్వకారణంగా నిలిచాడు. ఇప్పుడు ఏడేళ్ల వయస్సులో దేశ ప్రధానితో శభాష్‌ అని మెప్పు పొందడమే కాకుండా.. రాష్ట్రీయ బాల పురస్కారాన్ని దక్కించుకున్నాడు సికింద్రాబాద్‌కు చెందిన విరాట్‌ చంద్ర. మూడో తరగతి చదువుతున్న సమయంలోనే కిలిమంజారో పర్వతాన్ని అధిరోహించాడు. ప్రతికూల వాతావరణ పరిస్థితులను దాటుకుని 5,895 మీటర్ల ఎత్తులోని శిఖరం అంచుకు ఆరు రోజుల్లో చేరుకున్నాడు. ఇందుకోసం విరాట్ చంద్ర ఆరు నెలల పాటు కఠిన శిక్షణ పొందాడు.

9 రోజుల్లో బేస్ క్యాంపునకు
పంజాబ్​లోని రోపర్‌కు చెందిన సాన్వీ సూద్ అనే ఓ ఏడేళ్ల బాలిక సైతం చరిత్ర సృష్టించింది. కేవలం తొమ్మిది రోజుల్లోనే ఎవరెస్టు బేస్​ క్యాంపునకు చేరుకున్న ఆమె.. అతిపిన్న వయస్కురాలిగా రికార్డ్​ నెలకొల్పి అందరి మన్ననలు పొందింది. ఎవరెస్టుపై 5,364 మీటర్ల ఎత్తులోని 65 కిలోమీటర్ల ట్రాక్​లో విపరీతమైన చలి, బలమైన గాలులను సైతం తట్టుకుంటూ ఈ ప్రయాణాన్ని కొనసాగించింది. ఆక్సిజన్ అంతంత మాత్రంగానే అందినా తన ఎవరెస్ట్ ప్రయాణంలో ఎక్కడా బెదరలేదు.

ABOUT THE AUTHOR

...view details