తెలంగాణ

telangana

కుంటలో పడి ఐదుగురు చిన్నారులు మృతి.. గ్యాస్​ లీకై మరో నలుగురు

By

Published : Aug 3, 2022, 5:18 PM IST

స్నానం కోసం నీటి కుంటలో దిగిన ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణ ఘటన గుజరాత్​లోని సురేంద్రనగర్​లో జరిగింది. మరో ఘటనలో విషవాయువులు లీకై నలుగురు మరణించగా.. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ప్రమాదం హరియాణాలోని బహదూర్​గఢ్​లో జరిగింది.

gujarat latest news
gujarat latest news

గుజరాత్ సురేంద్రనగర్​లో దారుణం జరిగింది. ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి ఐదుగురు చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. మేఠాన్​, సర్వాల్​ గ్రామాల మధ్య నీటి కుంట ఉంది. స్నానం కోసం కుంటలో దిగిన చిన్నారులు మరణించారు. సమాచారం అందుకున్న పోలీసులు.. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్నారు. మోటార్ల సాయంతో నీటిని తొలగించారు. ఒకే గ్రామానికి చెందిన ఐదుగురు చిన్నారులు ఒకేసారి మరణించడం వల్ల మేఠాన్​లో విషాదఛాయలు అలుముకున్నాయి.

మరో ఘటనలో విషవాయువులు లీకై నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. హరియాణాలోని బహదూర్​గఢ్​లోని ఓ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం జరిగింది. ఐదు అడుగుల లోతున్న ట్యాంకును శుభ్రపరిచేందుకు ఆరుగురు కార్మికులు లోపలికి దిగారు. విషవాయువులు విడుదల కావడం వల్ల నలుగురు మరణించారు. మరో ఇద్దరిని ఆస్పత్రికి తరలించామని.. వారి పరిస్థితి విషమంగా ఉందని డీసీపీ శక్తి సింగ్ తెలిపారు. దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టామన్నారు.

ABOUT THE AUTHOR

...view details