తెలంగాణ

telangana

త్రుటిలో తప్పిన పెను ప్రమాదం.. ఎదురు పడ్డ రెండు రైళ్లు.. చివరి నిమిషంలో..

By

Published : Dec 31, 2022, 3:55 PM IST

ఒకే ప్లాట్​ఫాంపై రెండు రైళ్లు ఎదురుపడ్డాయి. ఉత్తర్​ప్రదేశ్​లో ఈ ఘటన జరిగింది. ఆ తర్వాత ఏమైందంటే?

trains on same track in bahraich
trains came on same track in uttarpradesh

ఎక్కడైనా ఒక ట్రైన్​ వచ్చిన తర్వాత ఆ ట్రాక్​పైకి మరో ట్రైన్​ వస్తుంది. కానీ ఉత్తర్​ప్రదేశ్​లోని రిసియా రైల్వే స్టేషన్​లో మాత్రం ఓ వింత ఘటన జరిగింది. దీంతో అక్కడి ప్రజలు ఒక్కసారి షాక్​ అయినప్పటికీ త్రుటిలో పెద్ద అపాయం నుంచి బయటపడ్డామని ఊపిరి పీల్చుకున్నారు. అసలు ఏం జరిగిందంటే...

ట్రాక్​పై ఆగి ఉన్న ట్రైన్లు

శనివారం ఉదయం ఉత్తర్​ప్రదేశ్​లోని రిసియా రైల్వే స్టేషన్‌కు రెండు రైళ్లు ఒకేసారి వచ్చాయి. క్రాసింగ్ పడ్డ సమయంలో ఒకే ట్రాక్‌పై రెండు రైళ్లు ఎదురుబడ్డాయి. దీంతో తీవ్ర గందరగోళం తలెత్తింది. సరైన సమయానికి లోకో పైలట్‌లు అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల.. రైళ్లు ఢీకొనకుండా పెను ప్రమాదం తప్పింది. అయితే చాలా మంది ప్రయాణికులు భయంతో ట్రైన్​ దిగి బయటకు పరుగులు తీశారు. విషయం తెలుసుకున్న స్థానికులు స్టేషన్​ వద్ద భారీగా గుమిగూడారు.

ఆగి ఉన్న ట్రైన్లను చూసేందుకు వచ్చిన జనం

05360 నెంబరు ట్రైన్​ ఉదయం 8:24 గంటలకు బహ్రాయిచ్ వెళ్లడానికి రిసియా రైల్వే స్టేషన్ మూడో నెంబర్ ట్రాక్​పై ఆగింది. అదే సమయంలో బహ్రాయిచ్ నుంచి వస్తున్న 05361 రైలు కూడా మూడో నెంబర్ ట్రాక్‌పైనే ఉంది. ట్రాక్​పై వస్తున్న రైలును చూసిన 05360 రైలు లోకో పైలట్ ఇంజన్ లైట్ ఆన్ అప్రమత్తం చేశాడు. దీంతో అటువైపు నుంచి వస్తున్న మరో లోకో పైలట్ వెంటనే రైలును ఆపేశాడు. దాదాపు గంటన్నర పాటు అదే ట్రాక్‌పై రెండు రైళ్లు నిలిచిపోయాయి. అధికారులు రంగంలోకి దిగి చర్యలు చేపట్టారు చేశారు. ఆ తర్వాత బహ్రాయిచ్ నుంచి వచ్చిన రైలును లోకో పైలట్ వెనుకకు మళ్లించి.. ఒకటో నెంబర్ ప్లాట్​​ఫాంపైకి తీసుకొచ్చారు.

ట్రాక్​పై ఆగి ఉన్న ట్రైన్లు

ABOUT THE AUTHOR

...view details