తెలంగాణ

telangana

ఈ పాఠశాల​ కవలలకు కేరాఫ్​!

By

Published : Dec 2, 2021, 9:47 AM IST

కర్ణాటకలోని మంగళురులో ఉన్న పాఠశాల కవలలకు కేరాఫ్​గా మారింది. 2008 నుంచి ఈ స్కూల్లో కవలలు చేరడం మొదలైంది. ఇప్పటివరకు ఈ స్కూల్​లో ఉన్న కవల జంటల సంఖ్య 11కి చేరింది. పాఠశాలలో ఇంత మంది కవలలను చూస్తుంటే ఆశ్చర్యంగా ఉందంటున్నారు ఆ స్కూల్​ ప్రిన్సిపల్.

11 set of twins in same school
ఆ పాఠశాల​ కవలలకు కేరాఫ్​!

ఆ పాఠశాల​ కవలలకు కేరాఫ్​!

కవల పిల్లలను చూస్తేనే ముచ్చట పడిపోతుంటాం. అందులోనూ పాఠశాలలో కవలలు ఉంటే వారు ఆ స్కూల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తారు. అలాంటిది కర్ణాటకలోని ఓ పాఠశాల కవల విద్యార్థులకు కేరాఫ్​గా మారింది. ఒకటి కాదు, రెండు కాదు ఆ పాఠశాలలో ఏకంగా 11 కవల జంటలు ఉన్నాయి. వీరంతా 4వ తరగతి నుంచి 12వ తరగతి చదువుతున్నారు.

కవల విద్యార్థులు

దక్షిణ కన్నడ జిల్లా మంగళూరు శివార్లలోని కైరంగల పుణ్యకోటి నగరాలో ఉన్న.. శారద-గణపతి విద్యాకేంద్రం స్థానికంగా కవల పిల్లల స్కూల్​గా ప్రత్యేక గుర్తింపు పొందింది.

వివిధ తరగతులకు చెందిన కవల జంటలు
ఈ స్కూల్లో 4వ తరగతిలో మూడు, ఐదో తరగతిలో రెండు, ఆరు, ఏడు, ఎనిమిది, పదో తరగతుల్లో ఒక్కో జంట ఉన్నాయి. 12వ తరగతిలో రెండు కవల జంటలు ఉన్నాయి.

నాలుగో తరగతిలో జైనేశ్​-జయేశ్, సంజన-సంజయ్​, లతేశ్​-లవేశ్​లు.. ఐదో తరగతిలో చైతన్య పి.మల్లి-చందన పి.మల్లి, ధన్యశ్రీ-ధనుష్​లు ఉన్నారు. ఆరో తరగతిలో భవశ్రీ-దివ్యశ్రీ, కీర్తి ఆర్​.గట్టీ-కీర్తన్​ ఆర్​.గట్టీ, ఏడో తరగతిలో సుజన్​-సుహాన్, పదో తరగతిలో శ్రీశాంత్-సుహాంత్​లు జంటలు ఉన్నాయి. 12వ తరగతిలో ప్రజ్ఞ-ప్రేక్ష, మోక్ష-మోక్షిత జంటలు విద్యను అభ్యసిస్తున్నారు.

"2008 నుంచి మా స్కూల్లో కవల పిల్లలు చేరడం మొదలైంది. ఆ తర్వాత క్రమంగా వారి సంఖ్య పెరిగింది. ఇప్పుడు మొత్తం 11 కవల జంటలు ఉన్నాయి. మొదట 2-3 కవలలు ఉన్నప్పుడు విశేషంగా అనిపించలేదు. కానీ ఇప్పుడు ఇంతమందిని చూస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. ఇంత మంది కవలలు ఉన్న స్కూల్​ మాదే అనుకుంట."

-శ్రీహరి, స్కూల్​ ప్రిన్సిపల్

ఈ పాఠశాల పేరు శారద-గణపతిలో కూడా జంట పేర్లు ఉండటం గమనార్హం.

ఇదీ చూడండి :హైవేపై భారీ కొండచిలువ.. వాహనదారులు షాక్

ABOUT THE AUTHOR

...view details