ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Police force at JC House in Tadipatri : జేసీ ఇంటి వద్దకు భారీగా పోలీసులు.. కల్యాణ మండపం భూమి పూజకు వెళ్లకుండా గృహనిర్భంధం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 25, 2023, 11:23 AM IST

Police_force_at_JC_House_in_Tadipatri

Police force at JC Prabhakar Reddy House in Tadipatri : అనంతపురం జిల్లా తాడిపత్రిలో మున్సిపల్ ఛైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. పెద్దపప్పూరు మండలం తిమ్మం చెరువు గ్రామంలోని  లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద కళ్యాణ మండప నిర్మాణానికి శుంకుస్థాపన చేయాలని ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే, దానికి అనుమతి లేదంటూ జేసీ ప్రభాకర్ రెడ్డిని పోలీసులు గృహ నిర్బంధం (house arrest) చేశారు.పెద్దపప్పూరులోను పలువురు టీడీపీ నేతలను పోలీసులు ముందస్తుగా అదుపులోకి తీసుకున్నారు.  

తిమ్మం చెరువు గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని ఎండోమెంట్​ పరిధి కిందకి తీసుకురావలని స్థానిక ఎమ్మెల్యే పెద్దారెడ్డి చూస్తున్నారని.. ఆలయాన్ని ఎండోమెంట్​ పరిధి కిందకు వెళ్లకుండా ఉండటానికి జేసీ ప్రభాకర్ రెడ్డి, స్థానిక గ్రామస్తులు అడ్డుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఆలయ సమీపంలో కళ్యాణ మండపం నిర్మాణం చేపట్టడానికి జేసీ శ్రీకారం చుట్టారు. దీంతో కల్యాణ మండపం భూమి పూజకు జేసీ వెళ్లకుండా పోలీసులు పెద్ద ఎత్తున ఆయన ఇంటి వద్దకు చేరుకొని గృహనిర్బంధం చేశారు.  

ABOUT THE AUTHOR

...view details