రాజకీయ కక్షతో విద్యుత్​ పరికరాల ధ్వంసం- మండిపడిన బాధిత టీడీపీ నేత - Electrical equipment destroyed

By ETV Bharat Andhra Pradesh Team

Published : May 23, 2024, 5:36 PM IST

thumbnail
రాజకీయ కక్షతో విద్యుత్​ పరికరాల ధ్వంసం- మండిపడిన బాధిత టీడీపీ నేత (ETV Bharat)

Equipment Destroyed at Fish Pond: రాజకీయ కక్షలతో తమ ఆస్తులను కొంతమంది ధ్వంసం చేస్తున్నారని నెల్లూరు జిల్లా టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. నెల్లూరు జిల్లాలో ఓ చేపల గుంట వద్ద అమర్చిన విద్యుత్ పరికరాలు ధ్వంసం కావడంపై టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా విడవలూరు మండలంలో టీడీపీ నాయకుడికి సంబంధించిన చేపల గుంటల వద్ద గుర్తుతెలియని వ్యక్తులు విద్యుత్ పరికరాలను ధ్వంసం చేశారు. 

రాజకీయ కక్షతోనే వీటిని ధ్వంసం చేశారని బాధితుడు, టీడీపీ నేత సత్యం రెడ్డి చెబుతున్నారు. ఈ ఘటనపై బాధితుడు విడవలూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమ చేపల గుంటల వద్ద అమర్చిన విద్యుత్ మోటార్లు, రేడియేటర్లు, పైపులు, ఇతర పరికరాలు పగలకొట్టారని సత్యం రెడ్డి తెలిపారు. మోటార్ల కోసం దొంగలు ఈ పని చేసుంటారని అనుకుంటే చిన్న వైరు ముక్క కూడా పోలేదని, ఉద్దేశపూర్వకంగా కొందరు రాజకీయ కక్షతోనే వీటిని ధ్వంసం చేశారని చెప్పారు. పోలీసులు విచారించి ఇందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

ABOUT THE AUTHOR

...view details

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.