ఆంధ్రప్రదేశ్

andhra pradesh

కరవు పరిస్థితులపై సీఎం అవాస్తవాలు మాని పొలం బాట పట్టాలి: సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 7, 2023, 9:28 PM IST

Criticism_of_CPI_State_Secretary_Ramakrishna_to_Jagan

Criticism of CPI State Secretary Ramakrishna to Jagan : రాష్ట్రంలో కరువు పరిస్థితులపై ముఖ్యమంత్రి అవాస్తవాలు చెప్పడం మాని.. పొలం బాట పట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో సుమారు 400 పైచిలుకు మండలాల్లో కరవు విలయతాండవం చేస్తుంటే కేవలం 100 మండలాలనే కరవు మండలాలుగా ప్రకటించడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఉమ్మడి కర్నూలు, అనంతపురం జిల్లాలో ఒకపక్క రైతులు కరవుతో వలసలు వెళ్తుంటే.. రాష్ట్రంలో కరవు కొంచమే ఉందంటూ ముఖ్యమంత్రి అవాస్తవాలు చెబుతున్నారని మండిపడ్డారు. 

కరవు గురించి వాస్తవాలు మాట్లాడకుండా చంద్రబాబుపై ఆరోపణలు చేయడం సరికాదు అన్నారు. రాష్ట్రంలో ఉన్న అన్నీ రాజకీయ పార్టీలు, రైతు సంఘాలతో కలుపుకొని ప్రభుత్వంపై కరవు యుద్ధం ప్రకటించాలని నిర్ణయించాం. దీనికోసం నవంబర్ 20, 21వ తేదీల్లో విజయవాడలో 30 గంటల పాటు నిరసన కార్యక్రమం చేపట్టి.. ఈ ప్రభుత్వానికి కళ్లు తెరిపిస్తాం అన్నారు. ముఖ్యమంత్రి కరవు గురించి మాట్లడాలి, రైతులతో చర్చించాలి.. పంట పొలాలను పరిశీలించాలని సీపీఐ తరపున డిమాండ్ చేస్తున్నామన్నారు.

ABOUT THE AUTHOR

...view details