ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CPI State Secretary Ramakrishna on Alliances: పార్టీ పొత్తులపై పవన్ కల్యాణ్ ప్రకటనను స్వాగతిస్తున్నాం: సీపీఐ రామకృష్ణ

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 14, 2023, 9:46 PM IST

Cpi_Ramakrishna_on_Alliances

CPI State Secretary Ramakrishna on Alliances: 'రాష్ట్రంలో మరికొన్ని నెలల్లో జరగబోయే ఎన్నికల్లో జనసేన, తెలుగుదేశం పార్టీలు కలిసే వెళ్తాయి. వచ్చే ఎన్నికల్లో జనసేన, టీడీపీ కలిసే పోటీ చేస్తాయి. ఇది మా ఇద్దరి భవిష్యత్తు కోసం కాదు.. రాష్ట్ర భవిష్యత్తు కోసమే' అంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ స్పందించారు. రాష్ట్రంలో అరాచక పాలనను అంతమొందించడానికి పవన్ కల్యాణ్ ముందుకు రావడాన్ని స్వాగతిస్తున్నామని రామకృష్ణ అన్నారు. రాజ్యాంగాన్ని కాపాడేందుకు.. ప్రజాస్వామ్య హక్కులను పరిరక్షించేందుకు ఏ పార్టీతో అయినా కలిసి ముందుకు వెళ్లేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రామకృష్ణ ప్రకటించారు.

CPI Ramakrishna Comments: ''రాజమండ్రి సెంట్రల్ జైల్ వద్ద పార్టీ పొత్తులపై పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను సీపీఐ పార్టీ స్వాగతిస్తుంది. ఎందుకంటే.. రాష్ట్రంలో ఈ అరాచక పాలనను అంతం చేయడానికి, దుర్మార్గ సీఎంను ఇంటికి పంపడానికి అందరూ కచ్చితంగా కలవాలి. వచ్చే ఎన్నికల్లో జనసేన-టీడీపీ కలిసే వెళ్తాయని పవన్ ప్రకటించారు. చాలా సంతోషం. ఇవాళ కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం కుమ్మక్కై ఈ దుర్మార్గమైన పాలన సాగిస్తున్నారు. ఈ నెల 17, 18 తేదీల్లో 26 జిల్లాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి.. ప్రజల్ని మరింత చైత్యనవంతుల్ని చేయబోతున్నాం. ఏ పార్టీతో అయినా కలిసి ముందుకు వెళ్లేందుకు మేము సిద్ధంగా ఉన్నాం. కేంద్రంలో బీజేపీకి సహకరిస్తూ రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిన ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజలు భరించే స్థితిలో లేరు'' అని సీపీఐ రామకృష్ణ అన్నారు.

ABOUT THE AUTHOR

...view details