ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CM Jagan Promises to Industrial Sector: వైసీపీ ఉత్తుత్తి ఉత్తర్వుల జాబితాలోకి చేరిన నీటిసరఫరా సంస్థ.. మాటలకే పరిమితమైన జగన్

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 4, 2023, 10:59 AM IST

CM Jagan Promises to Industrial Sector: సీఎం జగన్‌ హామీలు హర్మ్యాలు దాటుతుంటే అమలు అడుగు కూడా దాటడం లేదు. రాష్ట్ర ఆర్థిక పురోభివృద్ధికి మూలస్తంభమైన పారిశ్రామికరంగానికి ఇచ్చిన హామీని కూడా గాలికొదిలేశారు. సమీక్షించడమే తప్ప మూడేళ్లుగా ఏ ఒక్క ఆదేశాన్నీ ఆచరణలోకి తీసుకు రాలేకపోయారు. ప్రభుత్వం ఇచ్చే ఉత్తుత్తి ఉత్తర్వుల జాబితాలో పరిశ్రమలకు నీటి సరఫరా సంస్థ ఏర్పాటు కూడా చేరిపోయింది.

cm_jagan_promises_to_industrial_sector
cm_jagan_promises_to_industrial_sector

CM Jagan Promises to Industrial Sector: వైసీపీ ఉత్తుత్తి ఉత్తర్వుల జాబితాలోకి చేరిన నీటిసరఫరా సంస్థ.. మాటలకే పరిమితమైన జగన్

CM Jagan Promises to Industrial Sector:పరిశ్రమలకు నీటి సరఫరా పర్యవేక్షణ కోసం రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ- APIIC(Andhra Pradesh Industrial Infrastructure Corporation) నేతృత్వంలో ప్రత్యేక సంస్థను ఏర్పాటు చేస్తున్నామని మూడేళ్ల కిందట జగన్ సర్కారు ప్రకటించింది. అంతేకాకుండా సాగునీటికి ఇబ్బంది లేకుండా పరిశ్రమల అవసరాలు తీర్చడానికి సముద్రపు నీటిని నిర్లవణీకరణ చేసే ప్రతిపాదనలను పరిశీలించాలని. పరిశ్రమలపై నిర్వహించిన సమీక్షలోనూసీఎం జగన్ అధికారులకు ఆదేశించారు. చివరకు నీటి సరఫరా కోసం ప్రత్యేక సంస్థ ఏర్పాటుపై ప్రభుత్వం నుంచి ఉలుకూ పలుకూ లేదు.

Ferro Industries Shutdown: ఫెర్రో పరిశ్రమలకు విద్యుత్​ షాక్​.. బెంగతో కుంగిపోతున్న కార్మికులు..

Estimation of Water Availability in Reservoirs During Last Ten Years:గత పదేళ్లలో జలాశయాల్లో లభ్యమైన నీటి లెక్కల ఆధారంగా 6 నుంచి 10 శాతం నీటిని ప్రత్యేక సంస్థ పరిధిలోకి తీసుకుని పరిశ్రమలకు వినియోగించాలని అధికారులు ప్రతిపాదన సిద్ధం చేశారు. ఇలా సుమారు 106 టీఎంసీ(TMC)ల నీరు ఇవ్వడం సాధ్యమవుతుందని జలవనరుల శాఖ అప్పట్లోనే లెక్కలు కట్టింది. సాగుకు ఇబ్బంది లేకుండా వరద పోటెత్తిన సమయంలో దిగువకు విడుదల చేసే నీటినే పరిశ్రమలకు ప్రతిపాదించింది. ఇందుకోసం పారిశ్రామికవాడల్లో ప్రత్యేక జలాశయాలను ఏర్పాటు చేసి అక్కడికి నీటిని తరలించడానికి వీలుగా పైపులైన్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ఆలోచన చేసింది. కానీ ఇవేమీ కార్యరూపం దాల్చలేదు.

Food Processing Industries Towards Closure: 'అన్నీ ఉన్నా సహకారం సున్నా'.. జగన్​ పాలనలో మూసివేత దిశగా ఆహారశుద్ధి పరిశ్రమలు

Company Specially set up to Water Supply to Industries:ప్రత్యేక సంస్థకు నిధులు కేటాయించి బలోపేతం చేయాలని, పరిశ్రమలకిచ్చిన నీటిపై సెస్సు వసూలు చేయాలని ప్రభుత్వం భావించింది. దీనివల్ల పారిశ్రామికవేత్తలకు భరోసా కల్పించడం సాధ్యమవుతుందని అప్పట్లో చెప్పింది. కొత్తగా వచ్చే పారిశ్రామికవేత్తలకు అనుమతులిచ్చే సమయంలోనే నీటి కేటాయింపుపైనా స్పష్టత ఇవ్వడం సాధ్యమవుతుందని పేర్కొంది. విశాఖలోపరిశ్రమలకు నీటిని సరఫరా చేయడానికి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన విశాఖపట్నం ఇండస్ట్రియల్ వాటర్ సప్లై కంపెనీ- విస్కో(visakhapatnam industrial water supply company limited) కార్యకలాపాలను అధికారులు పరిశీలించారు. ఈ తరహాలోనే రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ప్రత్యేక వ్యవస్థను బలోపేతం చేస్తామని ప్రభుత్వం చెప్పింది.

Electricity Charges Burden on Industries in Andhra Pradesh: విద్యుత్​ భారాన్ని మోయలేక విలవిలలాడుతున్న పరిశ్రమలు..

YCP Government Delay in Implementation of Promises:రాష్ట్ర వ్యాప్తంగా ఒక్కటే బోర్డు ఏర్పాటు చేయాలా? లేదా రాయలసీమ, ఆంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు ప్రత్యేకంగా ఏర్పాటు చేయాలా? అనే ప్రతిపాదనలను పరిశీలిస్తున్నట్లు కూడా అప్పట్లో అధికారులు తెలిపారు. సర్కారు సమీక్షలతో ప్రస్తుతం ఉన్న పరిశ్రమలు, భవిష్యత్తులో రాబోయే పరిశ్రమల అవసరాలు తీరతాయని పారిశ్రామికవేత్తలు భావించారు. కానీ వైసీపీ సర్కారు హమీల అమలులో చేతులెత్తేయడంతో ప్రతిపాదన దశ దాటి ఒక్క అడుగూ ముందుకు పడలేదు.

ABOUT THE AUTHOR

...view details