ETV Bharat / state

Small Scale Industries in AP: చిన్న తరహా పరిశ్రమలపై వైసీపీ సర్కార్ చిన్నచూపు.. అటకెక్కించిన పారిశ్రామిక సర్వే..

author img

By

Published : Aug 9, 2023, 7:23 AM IST

small_scale_industries
small_scale_industries

Small Scale Industries in AP: రాష్ట్రంలో చిన్న పరిశ్రమలెన్ని? వాటి ద్వారా ఎంత మందికి.. ఉపాధి లభిస్తోంది? ఈ ప్రాథమిక సమాచారం లేకుండానే ఎమ్ఎస్ఎమ్ఈలను ఆదుకుంటున్నట్లు జగన్‌ ప్రభుత్వం ఊదరగొడుతోంది. మూడేళ్ల క్రితం.. ఆర్భాటంగా ప్రకటించిన పారిశ్రామిక సర్వేను.. అటకెక్కించింది. సర్వేనే పూర్తిచేయలేకపోయిన సర్కార్‌ కోట్ల రూపాయల ప్రోత్సాహకాలు ఇస్తున్నామని.. ప్రచారం చేసుకోవడాన్ని పారిశ్రామిక సంఘాలు తప్పుపడుతున్నాయి.

Small Scale Industries in AP: దేశవ్యాప్తంగా.. ఎమ్ఎస్ఎమ్ఈల వివరాల నమోదుకు కేంద్రం ఉద్యమ్‌ పోర్టల్‌ను కొన్నేళ్ల కిందట తీసుకొచ్చింది. అందులో ఉత్పత్తి, సేవా రంగాలకు సంబంధించిన వివరాలు రిజిస్ట్రేషన్‌ సమయంలోనే నమోదుచేయడం వల్ల.. రంగాల వారీగా ఎన్ని పరిశ్రమలు ఉన్నాయనే వివరాలు.. తెలుసుకోవడం సాధ్యం అవుతుంది. ఇదే తీరులో వైసీపీ ప్రభుత్వం కూడా.. మూడేళ్ల కిందట పరిశ్రమల ప్రత్యేక సర్వే కార్యక్రమం.. చేపట్టింది. గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా సర్వే నిర్వహించేందుకు.. ప్రత్యేక యాప్‌ రూపొందించామని హడావుడి చేసింది. సచివాలయ పరిధిలో ఉండే అన్ని కంపెనీల నిర్వాహకుల వద్దకు వెళ్లి 40 ప్రశ్నల ద్వారా వివరాలు సేకరించే ప్రక్రియ చేపట్టింది. కానీ.. ఆ సర్వేను అసంపూర్తిగా నిలిపేసింది.

Sugar Farmers Protest: చక్కర పరిశ్రమల విక్రయానికి లిక్విడేటర్ నియామకం.. పోరుబాట పట్టిన రైతులు..

Small Scale Industries Survey: చిన్న పరిశ్రమలు.. ఏర్పాటు చేసే సమయంలో రిజిస్ట్రేషన్‌ చేసుకోవడం తప్ప వైసీపీ ప్రభుత్వం ఆ తర్వాత వాటి గురించి.. పట్టించుకోవడం లేదు. ప్రస్తుతం వాటి స్థితేంటో ప్రభుత్వం వద్ద సమాచారం లేదు. ప్రోత్సాహక బకాయిల విడుదల కోసం.. జిల్లాల వారీగా అందిన దరఖాస్తుల్లో పేర్కొన్న చిరునామాల పరిశీలనకు వెళ్లిన అధికారులకు పలుచోట్ల.. యూనిట్లు కనిపించలేదు. అవి ఎప్పుడు మూతపడ్డాయి? ఎందుకు మూతపడ్డాయో తెలుసుకోవడం అధికారులకు సాధ్యం కాలేదు.

Small Scale Industries: సర్వే పూర్తైతే.. ఉత్పత్తి, సేవా రంగాల వారీగా పరిశ్రమల సంఖ్యను గుర్తించడంతో పాటు రంగాల వారీగా ప్రోత్సహించడం.. ప్రభుత్వానికి సాధ్యం అయ్యేది. చిన్న తరహా పరిశ్రమలకు అవసరమైన మానవ వనరుల కొరతను గుర్తించి నైపుణ్య శిక్షణ అందించడం ద్వారా యువతకు ఉపాధి కల్పిస్తామని.. ప్రభుత్వం ప్రకటించినా అమలుకు మాత్రం నోచుకోలేదు. రాష్ట్రంలో ఉన్న ప్రతి పరిశ్రమకు ప్రత్యేక గుర్తింపు సంఖ్య కేటాయించేలా సాఫ్ట్‌వేర్‌ రూపొందించారు. ఆ సంఖ్య ఆధారంగా పరిశ్రమ పూర్తి వివరాలు అందుబాటులో ఉంటాయని.. వైసీపీ ప్రభుత్వం గొప్పగా ప్రకటించింది. కంపెనీకి ఎలాంటి సమస్య ఎదురైనా ముందుండి చూసుకుంటామని మాటలు చెప్పింది. చివరకు అది.. ఉత్తుత్తి ప్రచారమే అయింది.

industries incentives గతేడాది రాయితీలు లేవు..! ఈసారైన బటన్ నొక్కుతారని ఎదురు చూస్తున్న పారిశ్రామిక వేత్తలు!

Small Scale Industries in AP: ఎమ్ఎస్ఎమ్ఈ చట్టం ప్రకారం జిల్లాల్లో కొత్తగా ఏర్పాటు చేసే పరిశ్రమల వివరాలను సంబంధిత జిల్లా పరిశ్రమల కేంద్రం నమోదు చేస్తోంది. అవి ఉత్పత్తిలోకి వచ్చాక.. రికార్డుల్లో నమోదు చేసేసి.. వాటి కార్యకలాపాల గురించి.. పట్టించుకోవడం లేదు. మూడేళ్ల కిందట ప్రారంభించిన సర్వేనే.. పూర్తి చేయలేక చేతులెత్తేసిన జగన్‌ సర్కార్‌, ఎమ్ఎస్ఎమ్ఈలకు ప్రత్యేక నిధులు కేటాయిస్తామంటే.. పారిశ్రామికవేత్తలకు నమ్మకం కలుగుతుందా..? అనేది అంతుచిక్కని ప్రశ్నే. చిన్న పరిశ్రమల్ని చేయి పట్టుకుని నడిపిస్తామని చెప్పే జగన్‌.. అసలు ప్రాథమిక సమాచారమే లేకుండా ఎలా నడిపిస్తారనే సందేహాలు వెల్లువెత్తుతున్నాయి.

CITU on Ferro alloys factories "కొత్త పరిశ్రమల కోసం సమ్మిట్​లు కాదు.. ఉన్న పరిశ్రమలు నడపండి"

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.