ETV Bharat / state

CITU on Ferro alloys factories "కొత్త పరిశ్రమల కోసం సమ్మిట్​లు కాదు.. ఉన్న పరిశ్రమలు నడపండి"

author img

By

Published : Aug 2, 2023, 11:51 AM IST

CITU Leader Narasingha Rao Fires on YSRCP Over Ferro Alloys: కొత్త పరిశ్రమల కోసం సమ్మిట్ లు పెట్టడం కాదని.. ఉన్న పరిశ్రమలను సక్రమంగా నడపాలంటూ.. CITU రాష్ట్రస్థాయి సదస్సు డిమాండ్ చేసింది. వైసీపీ ప్రభుత్వం నిర్వాకంతో ఫెర్రో ఎల్లాయ్స్​ పరిశ్రమలు మూతపడే పరిస్థితి నెలకొందని మండిపడ్డారు.

Ferro Alloys Conference
Ferro Alloys Conference

CITU Leader Narasingha Rao Fires on YSRCP Over Ferro Alloys: పెట్టుబడులు, కొత్త పరిశ్రమల కోసం పెట్టుబడిదారుల సదస్సులు పెట్టడం కాదు.. ఉన్న పరిశ్రమలను కాపాడి.. తగిన ప్రోత్సహకాలు అందించి.. సక్రమంగా నడపాలంటూ సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నరసింగ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఫెర్రో ఎల్లాయ్స్​ పరిశ్రమలు, కార్మికుల ఉపాధి పరిరక్షణపై సీఐటీయూ ఆధ్వర్యంలో విజయనగరంలో రాష్ట్ర స్థాయి సదస్సు జరిగింది. విజయనగరం రెవిన్యూ భవనంలో జరిగిన ఈ సదస్సుకు.. సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి.హెచ్. నరసింగరావు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో ఉన్న 39 ఫెర్రో ఎల్లాయ్స్​ కంపెనీలో ప్రత్యక్షంగా, పరోక్షంగా 30వేల మంది కార్మికులు జీవనోపాధి పొందుతున్నారని.. అయితే., రాష్ట్ర ప్రభుత్వం తీరుతో ఈ పరిశ్రమల పరిస్థితి అగమ్యగోచరంగా మారి.. కార్మికుల భవితవ్యం ప్రశ్నార్థకంగా మారిందన్నారు.

ఫెర్రో పరిశ్రమల ఖర్చులో 50 శాతం విద్యుత్తు కోసమే ఖర్చు చేయాల్సి ఉంటుందని.. గతంలో అయితే ఈ ఫ్యాక్టరీలకు తక్కువ ధరకే విద్యుత్తుని అందించారని తెలిపారు. ప్రస్తుతం ఇతర పరిశ్రమలకు యూనిట్​కు 5రూపాయలు విధించగా., ఫెర్రోలపై యూనిట్​కు 8.59రూపాయలు భారం మోపారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో., ఆ కంపెనీలపై 3వేల కోట్ల రూపాయాలు అదనపు భారం పడుతోందని విమర్శించారు. ఝార్ఖండ్​లో ఫెర్రో పరిశ్రమలకు యూనిట్​కి 4.50రూపాయలకే విద్యుత్తు సరఫరా చేస్తున్నారని స్పష్టం చేశారు.

రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం తీరుతో విజయనగరం జిల్లాలో 16 ఫెర్రో ఫ్యాక్టరీలు మూతపడే పరిస్థితి నెలకొందన్నారు. ప్రభుత్వ దుర్మార్గమైన చర్యల కారణంగా.. కార్మికులంతా రోడ్డున పడే పరిస్థితి ఏర్పడిందని మండిపడ్డారు. పరిశ్రమలు, వ్యవసాయంపై వైసీపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. సమ్మిట్​లు పెట్టడం కాదు., ఉన్న పరిశ్రమలను సక్రమంగా నడపండని ఆయన హితువు పలికారు.

"39 ఫెర్రో ఎల్లాయ్స్​ కంపెనీలు ఉన్నాయి. ఈ కంపెనీల్లో ఖనిజం, లోహం కరిగిస్తారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా 30 వేల కార్మికుల కుటుంబాలు ఈ కంపెనీలపై ఆధారపడి ఉన్నాయి. రాష్ట్రంలో మిగిలిన పరిశ్రమలన్నింటిలో యూనిట్​కు 5 రూపాయలు వసూలు చేయగా.. ఫెర్రో ఎల్లాయ్స్​ పరిశ్రమల్లో మాత్రం 8 రూపాయలకు పైనే వసూలు చేస్తున్నారు. అన్ని రకాల ఛార్జీలు పెరిగినందువల్ల ఒక్క పరిశ్రమపై 3వేల కోట్ల రూపాయల భారం పడుతోంది. కొత్త పరిశ్రమల కోసం సమ్మిట్​లు పెట్టడం కాదు.. ఉన్న పరిశ్రమలు మూత పడకుండా నడపాలి. ఫెర్రో ఎల్లాయ్స్​ పరిశ్రమను కాపాడుకోవాలి. దీనిని కాపాడుకోవడం కోసం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తాం. ఈ పరిశ్రమలను కాపాడుకోవడానికి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల మద్దతు కూడబెడతాం"-నరసింగరావు, సీఐటీయూ ప్రధాన కార్యదర్శి

"కొత్త పరిశ్రమల కోసం సమ్మిట్​లు కాదు.. ఉన్న పరిశ్రమలు నడపండి"
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.