- పుల్వామా దాడి నిందితుడికి షాక్.. జైషే మొహమ్మద్ కమాండర్ ఇల్లు నేలమట్టం
40 మంది సీఆర్పీఎఫ్ సిబ్బందిని పొట్టన పెట్టుకున్న జైషే మొహమ్మద్ ఉగ్రవాద ముఠా కమాండర్ ఆశిఖ్ నెంగ్రూకు చెందిన రెండంతస్తుల భవనాన్ని అధికారులు కూల్చివేశారు. జమ్మూకశ్మీర్లోని పుల్వామా జిల్లాలో ఉన్న ఈ ఇల్లు ప్రభుత్వ భూమిలో ఉన్నట్లు వారు తెలిపారు. కాగా శనివారం దీన్ని నెలమట్టం చేశారు.
- అంబేడ్కర్, పూలేపై అనుచిత వాఖ్యలు.. మహారాష్ట్ర మంత్రిపై సిరాతో దాడి
మహారాష్ట్ర మంత్రి, భాజపా సీనియర్ నేత చంద్రకాంత్పాటిల్పై ఓ దుండగుడు సిరాతో దాడి చేశాడు. పుణెలోని మిమ్రీ పట్టణంలో ఆయన పర్యటిస్తుండగా ఈ ఘటన జరిగింది.
- మాండౌస్ తుపాను విలయం.. రాయలసీమలో జోరు వానలు
Impact of Cyclone Mandous in Rayalaseema: మాండౌస్ తుపాను ప్రభావంతో రాయలసీమ అంతటా జోరు వానలు పడుతున్నాయి. చిత్తూరు, తిరుపతి, కడప, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో జనజీవనం అస్తవ్యస్తమైంది. నెల్లూరు సహా జిల్లాలోని పలు నగరాల్లో కాలనీలు నీట మునిగాయి. ఉమ్మడి అనంతపురం, కడప జిల్లాలోని నదులు, వాగులు పొంగి పొర్లుతుండగా..రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పంటపొలాల్లోకి వరద నీరు చేరింది.
- బయటకొచ్చిన మరో మాయజాలం.. మంత్రి గుమ్మనూరు జయరాం భూకొనుగోలు లీలలు
Minister Jayaram Land Registration Scam: మంత్రి గుమ్మనూరు భూలావాదేవీలో మరో కోణం వెలుగులోకి వచ్చింది. ఇట్టినా భూముల వ్యవహారంలో భూ మార్పిడిని దాచిపెట్టి..బంధుగణానికి పంచిపెట్టినట్లు తేలింది. భూ మార్పిడి దాచిపెట్టి రిజిస్ట్రేషన్ చేయించడం వల్ల ప్రభుత్వ ఖజానాకు గండిపడింది. రిజిస్ట్రేషన్ జరిగిన తీరుపై విచారణ జరిపితే మరిన్ని అక్రమాలు వెలుగులోకి వచ్చే ఆస్కారముందని తెలుస్తోంది.
- ప్రతిష్ఠించిన దేవతామూర్తుల విగ్రహాలను వేరొక చోటుకి మారడానికి వీల్లేదు: హైకోర్టు
Mahankakali Temple case: వేదమంత్రాల నడుమ శాస్త్రోక్తంగా ఓసారి ప్రతిష్ఠించిన దేవతామూర్తుల విగ్రహాలను వేరొక చోటుకి మారడానికి వీల్లేదని హైకోర్టు స్పష్టంచేసింది. అలా మార్చడం అంటే కొత్తగా దేవాలయాన్ని నిర్మించినట్లు అవుతుందని పేర్కొంది. ఆ విధంగా చేయడానికి ధర్మశాస్త్రం అనుమతించడం లేదని తెలిపింది. జీర్ణోద్ధారణ కోసమైనా విగ్రహాలను/మూలవిరాట్ను మరో స్థానానికి తరలించకూడదని తెలిపింది. దేవాలయంలో మరమ్మతుల కోసం మాత్రమే తాత్కాలికంగా తొలగించవచ్చని పేర్కొంది.
- 'విరాట్ అండతోనే డబుల్ సెంచరీ.. ఔట్ కాకపోయి ఉంటే 300 కొట్టేవాడ్ని'
బంగ్లాదేశ్తో మూడో వన్డేలో వీర విధ్వంసం సృష్టించిన టీమ్ఇండియా యువ బ్యాటర్ ఇషాన్ కిషన్.. తాను ఔట్ కాకపోయి ఉంటే త్రిశతకం నమోదు చేసేవాడినని చెప్పుకొచ్చాడు. విరాట్ కోహ్లీ అండతోనే తాను ఈ రికార్డు సాధించగలిగినట్లు తెలిపాడు.
- UPIకి మించి.. డిజిటల్ రూపాయితో ఎన్నో ప్రయోజనాలు.. రూ.వేల కోట్లు ఆదా!
డిజిటల్ రూపాయిని ఆర్బీఐ ప్రయోగాత్మకంగా నాలుగు నగరాల్లో విడుదల చేసింది. ప్రస్తుతం మనం సులువుగా యూపీఐ ద్వారా లావాదేవీలు చేస్తున్నాం. అయినా ఈ డిజిటల్ రూపాయి ఎందుకు అనే అనుమానాలు వస్తాయి. అయితే, డిజిటల్ రూపాయితో యూపీఐకి మించిన ప్రయోజనాలు ఉన్నాయి.
- సజీవ ఔషధం సిద్ధం.. అవయవ మార్పిడి రోగులకు వరం.. క్యాన్సర్పైనా పోరు!
అవయవ మార్పిడి చేయించుకున్న రోగులు ఎదుర్కొనే అత్యంత తీవ్రమైన సమస్యకు శాస్త్రవేత్తలు విరుగుడును కనుగొన్నారు. ఇందుకోసం ఒక 'సజీవ ఔషధాన్ని' అభివృద్ధి చేశారు. ఇది అవయవ మార్పిడి చేసుకున్న రోగులకు వరంలాంటిదని పరిశోధకులు భావిస్తున్నారు.
- డబ్బింగ్ సినిమాలు సూపర్ హిట్.. వినోదాలు పంచి.. కోట్లు కురిపించి..
"సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ప్రేమించినట్లుగా మరెవరూ ప్రేమించలేరు".. తెలుగు వారి ముందుకొచ్చినప్పుడల్లా పరభాషా కథానాయకులు తరచూ చెప్పే మాటిది. ఇదేదో మన మెప్పు కోసం చెప్పే మాట కాదు. ఆ మాటలు అక్షర సత్యం కూడా. బొమ్మ బాగుందని తెలిస్తే చాలు.. అందులో స్టార్ ఎవరు? ఏ భాషా చిత్రం? అని లెక్కలేసుకోకుండా థియేటర్లకు వరుస కట్టేస్తుంటారు తెలుగు సినీప్రియులు. అందుకే ఏటా ఇక్కడ అనువాద చిత్రాల జోరు బాగానే కనిపిస్తుంటుంది.