ETV Bharat / bharat

పుల్వామా దాడి నిందితుడికి షాక్.. జైషే మొహమ్మద్‌ కమాండర్‌ ఇల్లు నేలమట్టం

author img

By

Published : Dec 11, 2022, 7:45 AM IST

Updated : Dec 11, 2022, 11:39 AM IST

40 మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బందిని పొట్టన పెట్టుకున్న జైషే మొహమ్మద్‌ ఉగ్రవాద ముఠా కమాండర్‌ ఆశిఖ్‌ నెంగ్రూకు చెందిన రెండంతస్తుల భవనాన్ని అధికారులు కూల్చివేశారు. జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉన్న ఈ ఇల్లు ప్రభుత్వ భూమిలో ఉన్నట్లు వారు తెలిపారు. కాగా శనివారం దీన్ని నెలమట్టం చేశారు.

Govt demolished Jaish e Mohammed commander house
జైషే మొహమ్మద్‌ కమాండర్‌ ఇల్లు కూల్చేసిన ప్రభుత్వం

జైషే మొహమ్మద్‌ కమాండర్‌ ఇల్లు కూల్చేసిన ప్రభుత్వం

జమ్మూకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో ఉన్న జైషే మొహమ్మద్‌ ఉగ్రవాద ముఠా కమాండర్‌ ఆశిఖ్‌ నెంగ్రూకు చెందిన రెండంతస్తుల భవనాన్ని అధికారులు శనివారం కూల్చివేశారు. రాజ్‌పోరా ప్రాంతంలోని న్యూ కాలనీలోని ఈ ఇల్లు ప్రభుత్వ భూమిలో ఉన్నట్లు వారు తెలిపారు. ఈ కారణంగా పోలీసు రక్షణ మధ్య జిల్లా అధికారులు పొక్లెయినుతో ఇంటిని పడగొట్టారు.

40 మంది సీఆర్పీఎఫ్‌ సిబ్బందిని పొట్టన పెట్టుకున్న 2019 నాటి పుల్వామా దాడిలో నిందితుడైన నెంగ్రూ "వాంటెడ్‌" జాబితాలో ఉన్నాడు. కేంద్ర ప్రభుత్వం గత ఏప్రిల్‌ నెలలో ఇతణ్ని చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న "ప్రత్యేక ఉగ్రవాది"గా ప్రకటించింది. నెంగ్రూ ఇంటి కూల్చివేతను మరో ఉగ్రవాద మూక "ది రెసిస్టెన్స్‌ ఫ్రంట్‌" (టీఆర్‌ఎఫ్‌) వ్యతిరేకించింది. దీనికి తగిన పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందని పోలీసులను, అధికారులను హెచ్చరించింది.

Last Updated : Dec 11, 2022, 11:39 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.