ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Amma vodi: 'అమ్మా లేదు.. అమ్మఒడీ రాలేదు'.. చిన్నారుల ఆవేదన

By

Published : Jun 18, 2022, 7:24 AM IST

amma vodi is not getting used in proper way says beneficiaries
అమ్మా లేదు.. అమ్మఒడీ రాలేదు

Amma vodi: ‘మాకు అమ్మ లేదు.. ప్రభుత్వం ఇచ్చే అమ్మఒడి కూడా రావడం లేదు’ అని ఇద్దరు చిన్నారులు చెప్పడంతో.. మాజీమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ చలించిపోయారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట హడ్కో కాలనీలో జరిగింది. చిన్నాల తరుణ్‌, తేజ అన్నదమ్ములు. వీరి తల్లిదండ్రులు చనిపోయారు. వారికి అమ్మఒడి పథకం వర్తించలేదు. ఎందుకని అడిగితే.. సాంకేతిక కారణాల వల్ల రావట్లేదని అధికారులు చెబుతున్నారని చిన్నారులు కృష్ణదాస్‌ ఎదుట వాపోయారు.

Amma vodi: ‘మాకు అమ్మ లేదు.. ప్రభుత్వం ఇచ్చే అమ్మఒడి కూడా రావడం లేదు’ అని ఇద్దరు చిన్నారులు చెప్పడంతో.. మాజీమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ చలించిపోయారు. ఈ సంఘటన శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట హడ్కో కాలనీలో శుక్రవారం నిర్వహించిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో చోటు చేసుకుంది. చిన్నాల తరుణ్‌, తేజ అన్నదమ్ములు. వీరి తల్లిదండ్రులు చనిపోయారు. ప్రస్తుతం వీరు అమ్మమ్మ బాలమ్మ, తాత చల్ల నర్సింహులు సంరక్షణలో పెరుగుతున్నారు.

అయిదో తరగతి చదువుతున్న తరుణ్‌కు, మూడో తరగతి చదువుతున్న తేజకు అమ్మఒడి పథకం వర్తించడం లేదు. ఎందుకని అడిగితే.. సాంకేతిక కారణాల వల్ల రావట్లేదని అధికారులు చెబుతున్నారని చిన్నారులు కృష్ణదాస్‌ ఎదుట వాపోయారు. వెంటనే సమస్యను పరిష్కరించాలని ఆయన అక్కడే ఉన్న అధికారులను ఆదేశించారు. సుమారు ఆరు నెలల క్రితం తల్లిదండ్రులు చనిపోయిన తర్వాత.. సంరక్షకులుగా అమ్మమ్మ, తాతలను రికార్డుల్లో చేర్చలేదని, అందుకే వీరికి అమ్మఒడి సాయం అందలేదని తెలిసింది.

వెంటనే ఆ ప్రక్రియ పూర్తిచేసి వారికి లబ్ధి అందిస్తామని అధికారులు చెప్పారు. ఇదే కాలనీలో సింహాద్రి కిరణ్‌ తను అంగవైకల్యంతో బాధపడుతున్నానని, కుటుంబ పోషణ భారంగా మారిందని, తాను వికలాంగ పింఛను కోసం ఎన్నిసార్లు ప్రయత్నించినా రాలేదని విలపించాడు. తనకు సదరం ధ్రువపత్రం ఇవ్వట్లేదని వాపోగా.. సమస్యను పరిష్కరించాలని అధికారులను ధర్మాన ఆదేశించారు.

ఇవీ చూడండి:

ABOUT THE AUTHOR

...view details