ఆంధ్రప్రదేశ్

andhra pradesh

BJP Press Meet పోలీసుల దాష్టికంపై నెల్లూరు జిల్లా బీజేపీ నేతలు ఫైర్.. కావలిలో అవినీతి రాజ్యమేలుతోందని ఆరోపణ

By

Published : May 13, 2023, 4:41 PM IST

BJP

BJP Press Meet: కావలి ఎమ్మెల్యే పాల్పడుతున్న అవినీతి, అక్రమాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తే పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించడం దారుణమని నెల్లూరులో భారతీయ జనతా పార్టీ నేతలు ఖండించారు. కావలి నియోజక వర్గంలో అవినీతి రాజ్యమేలుతోందని బీజేపీ నేతలు విమర్శించారు.

BJP Press Meet: నెల్లూరు జిల్లా కావలిలో అవినీతి రాజ్యమేలుతోందని భారతీయ జనతా పార్టీ విమర్శించింది. కావలి ఎమ్మెల్యే పాల్పడుతున్న అవినీతి, అక్రమాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకు వెళ్ళేందుకు ప్రయత్నిస్తే పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించడం దారుణమని నెల్లూరులో బీజేపీ నేతలు ఖండించారు. బీజేపీ నేతల పట్ల దుర్మార్గంగా వ్యవహరించిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు.

ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఎమ్మెల్యే మూడు కోట్ల రూపాయలు వసూలు చేశారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు భరత్ కుమార్ ఆరోపించారు. మద్యం దుకాణాలు, వ్యాపారుల వద్ద ఈ వసూళ్లకు పాల్పడినట్లు చెప్పారు. కావలిలో జరుగుతున్న అక్రమాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లేందుకు ముందుగానే అధికారులను అనుమతి కోరినా వారు తగిన విధంగా స్పందించలేదని విమర్శించారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం కూని అవుతోందని బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నేత సురేష్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు.

ముఖ్యమంత్రి పర్యటన ఎక్కడ జరిగినా ప్రతిపక్ష నేతలను గృహనిర్బంధం చేయడం, కర్ఫ్యూ వాతావరణ సృష్టించటం అనైతికమన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తుండడం తగదన్నారు. కావలిలో బీజేపీ నాయకుల పట్ల అప్రజాస్వామికంగా వ్యవహరించిన డీఎస్పీ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. వైసీపీ ప్రభుత్వం అసమర్థ పాలనపై భారతీయ జనతా పార్టీ పోరాడుతుందని మాజీ ఎమ్మెల్సీ వాకాటి నారాయణరెడ్డి చెప్పారు. అధికార పార్టీ నేతల అక్రమాలు, ప్రజల సమస్యలపై మండల, జిల్లా, రాష్ట్ర స్థాయిలో చార్జిషీట్ దాఖలు చేస్తున్నామన్నారు.

ముఖ్యమంత్రి కార్యక్రమానికి మూడు రోజుల ముందు మేము సీఎంని కలవాలని.. జిల్లాలో జరిగే అవినీతి పై విచారణ జరపాలని అధికారులకు చెప్పాము. దీనిపై ఆర్డీవో కలెక్టర్​కి చెప్తా అన్నారు తర్వాత మాకు ఎలాంటి సందేశం రాలేదు. అయితే రామిరెడ్డి ప్రతాప రెడ్డి నిన్న కూడా దోపిడి చేశారు. బార్ల దగ్గర, బ్రాందీ షాపుల దగ్గర రూ. 60లక్షలు వసూలు చేశారు... ఇది వాస్తవం కాదా..? అలాగే నిన్న కావలి నియోజక వర్గం వ్యాప్తంగా 3 కోట్లు వసూలు చేశారు.. కావాలంటే దీనిపై చర్చకు సిద్ధం. -భరత్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు

వెసీపీ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్​లో ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా కాల రాసింది. ముఖ్యమంత్రి పర్యటన ఎక్కడ జరిగినా సరే ప్రతిపక్ష నేతలను గృహనిర్బంధం చేయడం, అరెస్టులు చేయడం కర్ఫ్యూ వాతావరణ సృష్టించటం అనైతికంగా వ్యవహరిస్తున్నారు. నేడు రాష్ట్రంలో రాక్షస పాలన, నియంతృత్వ పాలనా, అరాచకమైన పాలన కొనసాగుతోంది. అందులో భాగంగానే కావలిలో అవినీతి వికటాట్టహాసం చేస్తుంది. నేను ఉన్నాను, నేను విన్నాను అని అంటావు కానీ ఏం విన్నావో మాకు అర్థం కావటం లేదు. -సురేష్ రెడ్డి, బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర నేత

పోలీసుల దాష్టికంపై నెల్లూరు జిల్లా బీజేపీ నేతలు ఫైర్

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details