ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CM Jagan Review Meeting with Agriculture Department Officials: రాష్ట్రంలో వర్షాభావం.. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై జగన్‌ సమీక్ష

By ETV Bharat Andhra Pradesh Team

Published : Sep 2, 2023, 7:15 AM IST

CM Jagan Review Meeting with Agriculture Department Officials: రాష్ట్రంలో వానలు లేకపోవడం, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై... క్యాంపు కార్యాలయంలో శుక్రవారం సీఎం జగన్ సమీక్షించారు. వర్షాల కొరత నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలుపై వ్యవసాయ సలహా మండళ్లతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని ఆయన అధికారులకు సూచించారు.

CM_Jagan_Review_Meeting_with_Agriculture_Department_Officials
CM_Jagan_Review_Meeting_with_Agriculture_Department_Officials

CM Jagan Review Meeting with Agriculture Department Officials: రాష్ట్రంలో వర్షాల కొరత.. ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై జగన్‌ సమీక్ష

CM Jagan Review Meeting with Agriculture Department Officials : రాష్ట్రంలో వర్షాల కొరత నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక అమలుపై వ్యవసాయ సలహా మండళ్లతో సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని సీఎం జగన్‌ మోహన్ రెడ్డి అధికారులకు సూచించారు. దేశ వ్యాప్తంగా ప్రతికూల వాతావరణ పరిస్థితులున్నాయన్న ఆయన విద్యుత్తు డిమాండు అనూహ్యంగా పెరిగిందన్నారు. అయినా ఎక్కడా రైతులు, ప్రజలకు ఇబ్బంది రాకుండా చూడటానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని సీఎం జగన్‌ పేర్కొన్నారు.

రాష్ట్రంలో వానలు లేకపోవడం, ప్రత్యామ్నాయ పంటల ప్రణాళికపై క్యాంపు కార్యాలయంలో వ్యవసాయ శాఖ అధికారులతో సీఎం జగన్ సమీక్షించారు. పశువులకు అవసరమైన దాణా, పశుగ్రాసాన్ని సిద్ధం చేసుకోవాలని ఆదేశించారు. రైతులకు మద్దతు ధర ఇవ్వకుంటే చట్టప్రకారం చర్యలు తీసుకునేలా.. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో కనీస మద్దతు ధర చట్టాన్ని ప్రవేశపెట్టాలని అన్నారు. వర్షపాతం తక్కువగా ఉన్న కొన్ని ప్రాంతాల్లో సాగునీటి సౌకర్యం ఉందని, అక్కడ వానల కొరత ప్రభావం తక్కువగానే ఉందని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు.

NO Relief Actions on Drought Situation In AP జగనన్న.. రైతన్న గోడు వినిపించడం లేదా! వర్షాభావ పరిస్థితులపై మొద్దు నిద్ర వీడేది ఎప్పుడు..?

CM Jagan Review on Alternative Crops Plan Due to Lack of Rains : వాతావరణ పరిస్థితులు, జలాశయాల్లో నీటి నిల్వలకు అనుగుణంగా ప్రత్యామ్నాయ ప్రణాళిక తయారు చేశామన్నారు. ఉలవలు, బొబ్బర్లు, మినుములు, పెసలు, కందులు, కొర్రలు, రాగి, జొన్న, మొక్కజొన్న, సజ్జ, పొద్దుతిరుగుడు తదితర పంటల సాగుకు 77 వేల క్వింటాళ్ల విత్తనాలు సిద్ధం చేశామని.. 80 శాతం రాయితీపై సరఫరా చేస్తున్నామని అధికారులు సీఎంకి వివరించారు. జూన్‌ నుంచి ఆగస్టు వరకు కురవాల్సిన సాధారణ వర్షపాతం 419.6 మిల్లీ మీటర్లు కాగా 314.6 మిల్లీ మీటర్ల వర్షం కురిసిందన్న అధికారులు.. రిజర్వాయర్ల నీటి సామర్థ్యం 1,174.58 TMCలు కాగా 507.88 TMCలకు నీరుందని తెలిపారు. ముందస్తుగా కృష్ణా డెల్టాకు సాగునీటిని అందించామన్నారు. గోదావరి డెల్టాలో ఎలాంటి ఇబ్బంది లేకుండా సాగు నీరందుతోందని చెప్పారు. 7,005 మెట్రిక్‌ టన్నుల పశుగ్రాస విత్తనాలు పంపిణీ చేస్తున్నామని... 74,023 టన్నుల TMR సిద్ధం చేశామని అధికారులు సీఎంకు వివరించారు.

Interview With Dr. Ashok on Anantapuram Crops: చిరుధాన్యాలు సాగుచేస్తే నష్టం తప్పించుకోవచ్చు: డా. అశోక్‌
తడిబొగ్గుతో విద్యుత్‌ ఉత్పత్తిలో ఇబ్బందులు గతేడాదితో పోలిస్తే గ్రిడ్‌ డిమాండ్‌ కనీసం 18 శాతం పెరిగిందన్నారు. వ్యవసాయ రంగం నుంచి వినియోగం పెరిగిందని గాలి లేకపోవడంతో పవన విద్యుత్తు ఉత్పత్తి తగ్గిందన్నారు. తడిబొగ్గు రావడంతో థర్మల్‌ కేంద్రాల్లో విద్యుత్తు ఉత్పత్తిలో ఇబ్బందులు వస్తున్నాయన్నారు. విద్యుత్తు కొరత రాకుండా పెద్ద మొత్తంలో డబ్బు పెట్టి కొంటున్నామని, మార్చి నుంచి ఆగస్టు వరకు 2,935 కోట్లు ఖర్చు పెట్టినట్లు వివరించారు. ఆగస్టు నెలలోనే 966.09 కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. యూనిట్‌ 7.52 పెట్టి కొనుగోలు చేస్తున్నామని, ప్రతిరోజూ కనీసం 44.25 మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు కొంటున్నామని అధికారులు వివరించారు.

Farmers Stuck in Grip of Drought: రాష్ట్రంలో కోరలు చాస్తోన్న కరవు.. ఎండిపోతున్న పంటలతో అన్నదాత ఆవేదన

ABOUT THE AUTHOR

...view details