ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Rayalaseema Farmers Waiting For HNSS Water: హంద్రీనీవాకు పారని సాగునీరు.. రైతు కంట పారుతున్న కన్నీరు

By

Published : Aug 13, 2023, 7:20 AM IST

Updated : Aug 13, 2023, 11:27 AM IST

Rayalaseema Farmers Waiting For HNSS Water: రాయలసీమ ప్రాంత ప్రజలకు సాగు, తాగు నీరు అందించడానికి హంద్రీనీవా సుజల స్రవంతిని ఏర్పాటు చేశారు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టాలు పెరుగుతున్నా..ప్రభుత్వం మాత్రం హంద్రీనీవాకు నీరు ఇంకా విడుదల చేయలేదు. నీరు లేక పంటలు వడబడుతున్నాయని అన్నదాతలు వాపోతున్నారు. వెంటనే నీరు వదిలితే పంటలు కాపాడిన వారవుతారని చెప్తున్నారు.

Rayalaseema_Farmers_Waiting_For_HNSS_Water
Rayalaseema_Farmers_Waiting_For_HNSS_Water

Rayalaseema_Farmers_Waiting_For_HNSS_Water: హంద్రీనీవాకు పారని సాగునీరు.. రైతు కంట పారుతున్న కన్నీరు

Rayalaseema Farmers Waiting For HNSS Water :రాయలసీమ వరప్రదాయని హంద్రీనీవా సుజల స్రవంతి. కరవు జిల్లాలకు సాగు, తాగు నీరు అందించే ఈ పథకం ద్వారా అధికారులు చుక్కనీరు విడుదల చేయలేదు. శ్రీశైలం జలాశయంలో నీటిమట్టాలు పెరుగుతున్నా మీనమేషాలు లెక్కిస్తున్నారు. పోతిరెడ్డిపాడుకు నీరు వదులుతున్న అధికారులు హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌ను పట్టించుకోవడం లేదు. ఈ నీటినే నమ్ముకుని సాగు చేసిన పంటలు ఎండుతున్నాయని రైతులు వాపోతున్నారు.
Government Not Give Water to Handri Neeva Sujala Sravanthi Project : రాయలసీమలోని ఉమ్మడి కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు జిల్లాలకు తాగు, సాగు నీరు అందించే లక్ష్యంతో ఏర్పాటు చేసిన పథకం హంద్రీనీవా సుజల స్రవంతి.! సుమారు 6 లక్షల ఎకరాలకు సాగు నీరు, వేలాది గ్రామాలకు తాగు నీరు అందిచడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. శ్రీశైలం జలాశయంలో 834 అడుగులకు నీరు చేరితే హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు నీరు విడుదల చేయవచ్చు. ప్రస్తుతం శ్రీశైలంలో 864 అడుగులకు జలాలు చేరినా అధికారులు మాత్రం నీళ్లు వదల్లేదు.

Rising Srisailam Reservoir Water Level : తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం జలాశయం ఎడమగట్టు విద్యుత్ కేంద్రం నుంచి ఉత్పత్తి ప్రారంభించగా రాష్ట్ర ప్రభుత్వం పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి నీరు విడుదల చేస్తోంది. కానీ హంద్రీనీవాకు మాత్రం చుక్కనీరు ఇవ్వడం లేదు. శ్రీశైలంలో తగిన నీటిమట్టం ఉన్నా, హెచ్‌ఎన్‌ఎస్‌ఎస్‌కు ఎందుకు నీరు ఎత్తిపోయడం లేదో అర్థం కాని పరిస్థితి. కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లోని కరవు ప్రాంతాలకు ఈ నీరు ఎంతో కీలకమైనా అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు వాపోతున్నారు.

Handri Neeva: హంద్రీ-నీవాపై సీఎం ఆర్భాటపు హామీలు.. నాలుగేళ్లుగా నిండని చెరువులు

"లక్షల పెట్టుబడి పెట్టాం :హంద్రీనీవా కాలువ కింది 15 ఎకరాలు పత్తి సాగు చేస్తున్నాము. గతంలో జూలైలో నీరు వచ్చాయి. ప్రస్తుతం ఆగస్టు వచ్చిన నీరు మాత్రం రావటం లేదు. వర్షాలు లేవు. పత్తి పంటపై లక్షల పెట్టుబడి పెట్టాం. రైతులను ఆదుకోవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాము."- మహిళా రైతు

హంద్రీనీవా కాలువ నీటిని నమ్ముకుని సాగు చేసిన పంటలు ఎండిపోతున్నాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. లక్షల పెట్టుబడి పెట్టి సాగు చేసిన వేరుశనగ, కంది, టమోటా, ఉల్లి, మిరప పైర్లు వడబడుతున్నాయని వాపోతున్నారు. ఓ వైపు వర్షాభావం మరో వైపు హంద్రీనీవా నీరు రాక తమ పరిస్థితి ఆగమ్య గోచరంగా మారిందని రైతులు ఆవేదన చెందుతున్నారు.

Farmers Clean Field Drains: కాలువల్లో పూడిక తీయించిన రైతులు.. నాలుగేళ్లుగా ఇదే సమస్య అని చందాలు వేసుకుని మరీ

ఓ సారి రైతులను చాడండి సారు :శ్రీశైలం నుంచి హంద్రీనీవాకు 40 టీఎంసీల నీటిని తీసుకునే వీలున్నా అధికారులు దృష్టి పెట్టడం లేదని రైతులు అంటున్నారు. వెంటనే నీరు వదిలితే తమ పంటలు కాపాడిన వారవుతారని అన్నదాతలు చెప్తున్నారు.

"నీరు కోసం పడిగాపులు :మేము మిరప సాగు చేస్తున్నాను. కాలువ నీళ్ల కోసం ఎదురుచూస్తున్నాం. ఇంత వరకు రాలేదు. వర్షాలు పడతాయనుకుంటే వానలు కూడా రావటం లేదు. నీరు ఇస్తే మమల్ని కాపాడిన వాళ్లు అవుతారు."- మిరప రైతు

rayalaseema Canals Ruins: పంట కాలువలపై జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం

Last Updated : Aug 13, 2023, 11:27 AM IST

ABOUT THE AUTHOR

...view details