ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'కర్నూలు జాయింట్ కలెక్టర్​(హౌసింగ్​) గా నరపురెడ్డి మౌర్య బాధ్యతలు'

By

Published : Jun 14, 2021, 9:51 PM IST

2023 సంవత్సరం చివరి వరకు రాష్ట్రంలో ప్రతి పేదవానికి ఇల్లు కల్పించాలన్నదే ప్రభుత్వ ధ్యేయమని....కర్నూలు జాయింట్ కలెక్టర్​ (హౌసింగ్​) గా బాధ్యతలు చెేపట్టిన నరపురెడ్డి మౌర్య తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు జగనన్న కాలనీలను ఆదర్శంగా ఏర్పాటుకు కృషి చేస్తానని ఆమె అన్నారు.

'కర్నూలు జాయింట్ కలెక్టర్​(హౌసింగ్​) గా నరపురెడ్డి మౌర్య బాధ్యతలు'
'కర్నూలు జాయింట్ కలెక్టర్​(హౌసింగ్​) గా నరపురెడ్డి మౌర్య బాధ్యతలు'

రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పేదలందరికీ ఇళ్లు జగనన్న కాలనీలను ఆదర్శంగా ఏర్పాటుకు కృషి చేస్తానని కర్నూలు జాయింట్ కలెక్టర్​ ​(హౌసింగ్​) గా బాధ్యతలు చేపట్టిన నరపురెడ్డి మౌర్య అన్నారు. ప్రభుత్వం చేపట్టిన నవరత్నాల్లో భాగంగా పేదలందరికీ ఇల్లు కార్యక్రమం నిర్వహించుటకు గాను సర్కార్.... తనను జాయింట్ కలెక్టర్ ( హౌసింగ్)గా నియమించిందన్నారు. ప్రభుత్వ ఆశయాలను విజయవంతం చేసేందుకు నిరంతరం కృషి చేస్తామన్నారు. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలలో వారికి గృహాలు కూడా ప్రభుత్వమే నిర్మించనున్నట్లు తెలిపారు. మొదటి విడతగా కర్నూలులో 98 వేల ఇళ్ల నిర్మాణం 2022 వ సంవత్సరానికి వీటిని పూర్తి చేయనున్నామన్నారు. ఇంటి నిర్మాణాలలో నిరుపేదలకు ఉపాధి కల్పించడం కూడా ప్రభుత్వం ముఖ్య ఉద్దేశమన్నారు.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details