ఆంధ్రప్రదేశ్

andhra pradesh

ప్రలోభాల పర్వం.. డబ్బులు పంపిణీ చేస్తున్న వీడియో వైరల్

By

Published : Mar 9, 2021, 11:00 AM IST

మున్సిపల్ ఎన్నికల ప్రచారాల గడువు సోమవారం సాయంత్రానికే ముగిసింది. అభ్యర్ధులు ప్రలోభాలకు తెర తీశారు. గుంటూరు జిల్లాలో వైకాపాకు చెందిన కొందరు వ్యక్తులు.. ఓటర్ల లిస్టు పట్టుకొని ఒక ఓటుకు వెయ్యి రూపాయలు చొప్పున ఇంటింటికి తిరిగి పంపిణీ చేస్తున్నారు. ఈ తతంగాన్నంతా.. కొందరు వీడియో తీశారు.

money distribution in muncipal election
మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాలు

మున్సిపల్ ఎన్నికల్లో ప్రలోభాలు

మున్సిపల్ ఎన్నికల్లో ప్రచార పర్వం ముగిసింది. పోలింగ్ సమయం దగ్గర పడుతోంది. అభ్యర్థులు ప్రలోభాలకు తెర తీశారు. గుంటూరు నగరంలోని అడవితక్కెళ్లపాడులో వైకాపా అభ్యర్ధి తరఫున.. ఓటర్లకు ఇంటింటికి తిరిగి డబ్బులు పంపిణీ చేశారు.

స్థానిక రాజీవ్ స్వగృహ కాలనీలో డబ్బులు పంపిణీ చేస్తుండగా.. కొందరు వీడియో తీశారు. ఓటర్ల జాబితా పట్టుకొని.. ఇంటి వారిగా ఎన్ని ఓట్లు ఉంటే అన్ని వెయ్యి రూపాయలు ఇవ్వటం.. ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.

TAGGED:

ABOUT THE AUTHOR

...view details