ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Lack of Funds for Govt Schools స్కూళ్లకు విద్యుత్ బిల్లులు కట్టని స్థితిలో ప్రభుత్వం! కనెక్షన్ తొలగింపుతో.. విద్యార్ధుల అవస్థలు!

By

Published : Aug 6, 2023, 9:07 PM IST

Lack of Funds for Government Schools: వేదిక ఎక్కితే చాలు.. మా ప్రభుత్వం నాడు- నేడు ద్వారా విద్యారంగంలో సమూల మార్పులు చేసిందంటూ సీఎం జగన్ నుంచి మంత్రుల వరకూ అందరూ గొప్పగా ప్రచారం చేసుకుంటూ ఉంటారు. క్షేత్రస్థాయిలో వాస్తవ పరిస్థితులు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ఉన్నాయి. మంత్రి బొత్స ఇచ్చిన హామీ ఆచరణ రూపం దాల్చకపోవడంతో.. ప్రభుత్వ పాఠశాలలకు విద్యుత్ బిల్లులు చెల్లించలేక ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Lack_of_Funds_for_Government_Schools
Lack_of_Funds_for_Government_Schools

Lack of Funds for Government Schools: ప్రభుత్వం, ప్రజా ప్రతినిధులు చెప్పే మాటలు చూస్తే కోటలు దాటుతున్నాయి. చేతలు మాత్రం గడప దాటడం లేదు అనడానికి ఇదే ఉదాహరణ. గత నెల 18న బాపట్ల విద్యాశాఖ ప్రాంతీయ సమావేశంలో విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ప్రభుత్వ ఉపాధ్యాయులకు నిధుల విషయంలో హామీ ఇచ్చారు. హామీ ఇచ్చిన తరువాతే రోజే పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రు జడ్పీ ఉన్నత పాఠశాలకు బిల్లుల కోసం విద్యుత్ శాఖ లైన్‌మెన్‌ వెళ్లారు.

పాఠశాల విద్యుత్ బిల్లు కట్టలేదని చెప్పి సరఫరా నిలిపివేయబోగా.. ఉపాధ్యాయులు మంత్రి బిల్లులు చెల్లించవద్దన్న విషయం లైన్​మెన్ దృష్టికి తీసుకెళ్లగా.. ప్రభుత్వం నుంచి తమకు ఎలాంటి ఉత్తర్వులు రాలేదని ఆసుపత్రి మినహా మిగిలిన ఎక్కడైనా బిల్లులు పెండింగ్‌ ఉంటే సరఫరా నిలిపివేయమన్నారని లైన్​మెన్ తెలిపారు. పాఠశాలకు విద్యుత్ నిలిపేస్తే విద్యార్థులకు,తరగతుల నిర్వహణకు ఆటంకం కలుగుతుందని ఉపాధ్యాయుులు బతిమిలాడినా.. తానేం చేయలేని లైన్​మెన్ తేల్చిచెప్పడంతో అప్పటికప్పుడు బిల్లులో సగం డబ్బుల్ని ప్రధానోపాధ్యాయుడు తన జేబులో నుంచి తీసి చెల్లించక తప్పలేదు.

Students fire on NADU-NEDU: ప్రారంభమైన సర్కారీ బడులు..నత్తనడకన నాడు-నేడు పనులు..

ప్రధానోపాధ్యాయులే బిల్లులు చెల్లింపు.. గతంతో పోలిస్తే విద్యుత్ వినియోగం పెరిగిందని, పాఠశాల వ్యవహారాలన్నీకరెంటుతోనే ముడిపడి ఉన్నాయని ఉపాధ్యాయులు అంటున్నారు. ఇంటరాక్టివ్‌ ఫ్లాట్‌ ప్యానల్స్‌లో డిజిటల్‌ విద్యా బోధన చేయాలంటే విద్యుత్ తప్పనిసరి. మధ్యాహ్న భోజనం తయారీకి అవసరమైన నీళ్లకు, ప్యూర్‌ఫైడ్‌ వాటర్‌ యూనిట్లకు కరెంట్ కావాలి. టీచర్లు, విద్యార్థుల హాజరు, టాయిలెట్స్‌ ఫొటోలు పాఠశాల విద్యాశాఖ కమిషనరేట్‌కు కంప్యూటర్ల ద్వారా పంపాలంటే విద్యుత్ ఉండాల్సిందేనని ఉపాధ్యాయులు చెబుతున్నారు. బిల్లుల చెల్లింపుల గురించి మంత్రి హామీ ఇచ్చినా రాతపూర్వక, స్పష్టమైన ఉత్తర్వులేవీ వెలువడకపోవడంతో ప్రధానోపాధ్యాయులే బిల్లులు చెల్లించాల్సి వస్తోందంటున్నారు.

Nadu-Nedu Scheme: పడకేసిన నాడు నేడు అభివృద్ధి పనులు

పెండింగ్‌లోనే బిల్లులు.. ఇకపై బిల్లులు వస్తే వాటిని ఎలా చెల్లించాలో తెలియడం లేదని ఉపాధ్యాయుల సంఘం నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి కరెంటు బిల్లుల చెల్లింపులకు సంబంధించి స్పష్టమైన జీవో విడుదల చేయాలని కోరుతున్నారు. మే నెలలో పాఠశాలలకు సెలవులు కావడంతో విద్యుత్ బిల్లులు చెల్లించలేదు. జూన్‌ బిల్లులు కూడా పెండింగ్‌లో ఉన్నాయి. ఇలా సగటున ప్రతి పాఠశాలకు రెండు నెలల బిల్లులు చెల్లించాల్సి రావటం ఆ బకాయిలు కూడా 3 వేల నుంచి 6 వేల రూపాయల వరకు ఉండటంతో వాటిని ఎలా చెల్లించాలని ప్రధానోపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

బోర్డు మార్చినంత సులువు కాదు.. మోడల్ స్కూలు అంటే..!

నిధులన్నీ విద్యుత్తు బిల్లుల చెల్లింపుకే..గతేడాది స్కూల్‌ గ్రాంటు మొత్తం ఐదు విడతల్లో చెల్లిస్తామని చెప్పి రెండు విడతలు మాత్రమే విడుదల చేశారని.. అప్​గ్రేడ్ అయిన పాఠశాలలకు ఈ ప్రభుత్వ హయాంలో గ్రాంట్లే విడుదల కాలేదని వాపోతున్నారు.నాడు- నేడు పనుల్లోభాగంగా చేపట్టిన గదుల నిర్మాణానికి నీళ్లు అవసరం. విద్యుత్తు సరఫరా నిలిపివేస్తే గోడలు, శ్లాబు తడపటానికి నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చుకోవాలని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మిగిలిన నిర్వహణ ఖర్చుల్ని పక్కన పెట్టి.. అందుబాటులో ఉన్న నిధుల్ని విద్యుత్తు బిల్లుల చెల్లింపుకు వినియోగిస్తున్నామంటున్నారు.

స్కూళ్లకు విద్యుత్ బిల్లులు కట్టని స్థితిలో ప్రభుత్వం!

ABOUT THE AUTHOR

...view details