ETV Bharat / state

Nadu-Nedu Scheme: పడకేసిన నాడు నేడు అభివృద్ధి పనులు

author img

By

Published : Apr 22, 2023, 5:44 PM IST

Nadu-Nedu Scheme Works Are Pending: ప్రచారమెక్కువ పని తక్కువ అన్న రీతిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నాడు- నేడు పనులు సాగుతున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామని సర్కారు చేస్తున్న ప్రకటనలకు వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా పోయింది. నూతన విద్యా సంవత్సరం ప్రారంభానికి రెండు నెలల సమయం మాత్రమే ఉన్నా కొత్త భవనాలు అందుబాటులోకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు.

Etv Bharat
Etv Bharat

Nadu-Nedu Scheme Works Are Pending : ప్రభుత్వ పాఠశాల రూపురేఖలు సమూలంగా మార్చేస్తామని నాడు చెప్పినా... నేడింకా పనులు పునాది దశలోనే మూలుగుతున్నాయి. నూతన విద్యా సంవత్సరం ప్రారంభానికి రెండు నెలల సమయం మాత్రమే ఉన్నా... కొత్త భవనాలు అందుబాటులోకి వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. నిధుల కొరతతో పాఠశాలల ఆధునికీకరణ, అదనపు తరగతి గదుల నిర్మాణాలు 40 శాతం కూడా పూర్తి కాలేదు. ఇదీ ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నాడు-నేడు పనుల పరిస్థితి.

ప్రచారమెక్కువ పని తక్కువ అన్న రీతిలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో నాడు- నేడు పనులు సాగుతున్నాయి. ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతామని సర్కారు చేస్తున్న ప్రకటనలకు.... వాస్తవ పరిస్థితులకు పొంతన లేకుండా పోయింది. నాడు-నేడు పథకంలో భాగంగా చేపట్టిన అదనపు తరగతి గదుల నిర్మాణం, పాఠశాలల ఆధునికీకరణ పనులు నిధుల కొరతతో అర్ధాంతరంగా ఆగిపోయాయి.

తరచూ సమీక్షలు నిర్వహించడం మినహా నిధులు విడుదల చేయకపోవడంతో పనులు ముందుకు సాగడం లేదు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో రెండో విడతలో 2వేల 341 పాఠశాలల్లో పనులు ప్రారంభించారు. అదనపు తరగతి గదులు, కొత్త భవనాలు, ప్రహరీ గోడలు ఇలా వివిధ రకాల పనులు చేపట్టారు. నిధుల విడుదలలో జాప్యంతో రెండు నెలలుగా నిర్మాణాలు ఆగిపోయాయి.


నిధుల కొరత లేకుండా చూస్తున్నామని ఉన్నతాధికారులు చెబుతున్నా.... రెండో విడత 'నాడు- నేడు' పనులు దాదాపు నిలిచిపోయాయి. చేసిన పనులకు ప్రభుత్వం నుంచి ఆలస్యంగా బిల్లులు రావడంతో పాటు సిమెంట్ కొరతతో నిర్మాణాలు మందగించాయి. కొత్త విద్యా సంవత్సరం నాటికైనా పనులు త్వరితగతిన పూర్తి చేస్తే విద్యార్థులకు ఇబ్బందులు తప్పుతాయని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ఇరుకు గదుల్లో, చెట్ల కింద ప్రస్తుతం ఇబ్బందులు పడుతూ పాఠాలు వింటున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

గుత్తేదారుకు బిల్లులు రాకపోవడంతో జిల్లాలోని పలు పాఠశాలల్లో పనులు నిలిచిపోయాయి. జూన్ నాటికి పూర్తి చేసి... వచ్చే విద్యా సంవత్సరానికి అందుబాటులోకి తీసుకురావాల్సి ఉండగా.. నిధుల కొరతతో నిర్మాణాలు పూర్తయ్యే పరిస్థితులు కనిపించడం లేదు.

" నాడు నేడు అనే పథకాన్ని తీసుకువచ్చి పాఠశాల రూపురేఖలు మారుస్తా అని ఓ పెద్ద మనిషి అన్నారు. వేలాది కోట్లా రూపాయలు కేంద్ర ప్రభుత్వ నిధుల్ని డైవర్ట్ చేసి నాడు నేడు పథకంలో నాసి రకం పనులు చేస్తున్నారు. విద్యా వ్యవస్థ దెబ్బ తినే విధంగా, పిల్లలకి కనీస వసతుల కల్పించలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉంది. మాటల్లో ఉన్న పనలు చేతల్లో లేకపోవడం బాధకరమని ప్రజలు చర్చించుకుంటున్నారు. " - స్థానికుడు

" నాడు నేడు పనులు ఆలస్యం చేస్తున్నారు. పిల్లలు చెట్ల కింద, క్లాస్ రూమ్​లో ఇరుకుగా కూర్చుటుంన్నారు. పిల్లలందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇంతకు ముందు పిల్లలు ఎక్కువ మంది ఉండేవారు. ఇక్కడ మంచి వసతులు లేక పోవడంతో ప్రైవేటు పాఠశాలలో చేర్పిస్తున్నారు. బిల్డింగ్ పనులు పునాదుల వరకే అయ్యాయి. ప్రభుత్వం తొందరగా బిల్డంగ్​లను పూర్తి చేయాలని కోరుతున్నాము. " - సుబ్రమణ్యం, స్థానికుడు

పడకేసిన నాడు నేడు అభివృద్ధి పనులు

ఇవీ చదవండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.