ఆంధ్రప్రదేశ్

andhra pradesh

CS Jawahar Reddy Review on Industries: పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన చర్యలు.. సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశాలు

By

Published : Aug 19, 2023, 5:24 PM IST

CS Jawahar Reddy Review on Industries: పరిశ్రమల్లో ప్రమాదాల నివారణకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాలని సీఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. ఈ మేరకు పరిశ్రమల శాఖ అధికారులతో సమీక్షా సమావేశం ఏర్పాటు చేశారు.

CS Jawahar Reddy Review on Industries
CS Jawahar Reddy Review on Industries

CS Jawahar Reddy Review on Industries: పరిశ్రమలలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, ప్రమాదాల నివారణపై సీఎస్ జవహర్ రెడ్డి సమీక్ష చేశారు. ప్రమాదాల నివారణకు మాక్ డ్రిల్​ నిర్వహించాలని ఆదేశించారు. రెండేళ్ల కాలంలో పరిశ్రమల్లో జరిగిన ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు.

రాష్ట్రంలోని ప్రమాదకర పరిశ్రమలన్నిటిలో థర్డ్ పార్టీ సేఫ్టీ ఆడిట్ జరగాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (Chief Secretary to Govt) డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి ఆదేశించారు. రసాయన పరిశ్రమల్లో ప్రమాదాల నివారణపై.. విజయవాడలోని సీఎస్ క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రసాయన సంబంధిత పరిశ్రమల్లో ప్రమాదాలను నివారించేందుకు కట్టుదిట్టమైన భద్రతా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు. ఇలాంటి పరిశ్రమలు (Industries) అన్నింటిలో పాటిస్తున్న భద్రతా ప్రమాణాలపై నిశిత సమీక్ష, పరిశీలన జరగాలని స్పష్టం చేశారు.

CS Reviews On Employees Housing and Health: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు.. అధికారులతో సీఎస్ సమీక్ష

వివిధ రసాయన ద్రావకాలు వినియోగించే పరిశ్రమల్లో ఆయా ద్రావకాల గాఢత వాటి స్వభావాన్ని ముందే పరీక్షించి తెలుసుకునేలా ప్రయోగశాలలు ఏర్పాటు చేసేలా చూడాలని పరిశ్రమలు, కర్మాగారాల శాఖల అధికారులను ఆదేశించారు. ప్రమాదకరమైన పరిశ్రమల్లో ప్రతి ఏటా ప్రమాదాల నివారణపై ప్రత్యేక మాక్ డ్రిల్ నిర్వహించాలని చెప్పారు. ప్రమాదాల నివారణకు రాష్ట్ర, జిల్లా, క్షేత్రస్థాయిల్లో తరచూ సమావేశాలు జరిపి.. పరిశ్రమల్లో అనుసరిస్తున్న మార్గదర్శకాలు, భద్రతా చర్యలపై పరిశీలన చేయాలని చెప్పారు.

రెండేళ్ల కాలంలో రసాయన సంబంధిత పరిశ్రమల్లో 11 ప్రమాదాలుజరిగాయని.. అలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఫ్యాక్టరీల డైరెక్టర్ డి.చంద్రశేఖర్‌వర్మ- రాష్ట్ర పరిశ్రమల శాఖ కమీషనర్ కె. ప్రవీణ్ కుమార్, రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ డైరెక్టర్ డా.బీఆర్ అంబేడ్కర్ తదితరులు పాల్గొన్నారు.

CS Review: పెండింగ్ ప్రాజెక్టులపై సీఎస్ సమీక్ష.. పనుల పురోగతిపై ఆరా

CS Review on child marriages: రాష్ట్రంలో 18 ఏళ్లలోపు వారికి బాల్య వివాహాలు (Child marriages) జరపకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కెఎస్. జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ఎక్కైడైనా బాల్య వివాహాలు జరిపినా జరిపేందుకు ప్రయత్నించినా అలాంటి కుటుంబాలకు ప్రభుత్వ ప్రధకాలు వర్తించవనే అవగాహనను కల్పించాలని ఆదేశించారు. సచివాలయంలో బాల్య వివాహాల నియంత్రణపై ప్రచార కార్యక్రమానికి సంబంధించి వివిధ శాఖల అధికారులతో సీఎస్ చర్చించారు.

రాష్ట్రంలో బాల్య వివాహాల నియంత్రణ కోసంప్రొహిబిషన్ ఆఫ్ చైల్డ్ మ్యారేజెస్ రూల్స్ - 2012 - 2023కు సంబంధించిన నిబంధనలను కట్టుదిట్టంగా అమలు చేయాలని స్పష్టం చేశారు. గ్రామ, వార్డు సచివాలయాల స్థాయిలో బాల్య వివాహాల నియంత్రణ మానిటరింగ్ కమిటీలను ఏర్పాటు చేయాలని సూచించారు. బాల్య వివాహాలు జరిగేందుకు ఆస్కారం ఉన్న ప్రాంతాలు, వర్గాలను విశ్లేషించి చర్యలు చేపట్టాల్సిందిగా సీఎస్ ఆదేశించారు.

Joint Staff Council Meeting: ఉద్యోగుల డిమాండ్లు పరిష్కరించేందుకు ప్రభుత్వం చర్యలు: జవహర్ రెడ్డి

ABOUT THE AUTHOR

...view details