ETV Bharat / crime

అపెక్స్‌ పరిశ్రమలో ప్రమాదం.. ముడి ఇనుము ద్రావణం పడి ముగ్గురి పరిస్థితి విషమం

author img

By

Published : Nov 9, 2022, 9:37 AM IST

Iron factory accident: కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి శివారు పారిశ్రామికవాడలో సాయంత్రం ప్రమాదం జరిగింది. ఇనుము నుంచి ముడి సరుకును తయారుచేసే అపెక్స్‌ పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయలయ్యాయి. క్షతగాత్రులను గుంటూరు జిల్లాలోని మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు.

అపెక్స్‌ పరిశ్రమలో ప్రమాదం
Iron factory accident

అత్యధిక ఉష్ణోగ్రతతో కూడిన ద్రవరూప ఇనుము పడి నలుగురికి తీవ్ర గాయాలు

Three people in critical condition: కృష్ణా జిల్లా గన్నవరం మండలం చిన్నఅవుటపల్లి శివారు పారిశ్రామికవాడలో సాయంత్రం ప్రమాదం జరిగింది. స్థానిక అపెక్స్‌ పరిశ్రమలో ఇనుము నుంచి ముడి సరుకును తయారుచేసి చెన్నై, ఇతర ప్రాంతాలకు తరలిస్తుంటారు. విధులు నిర్వహిస్తున్న నలుగురు కార్మికులపై అత్యధిక ఉష్ణోగ్రతతో కూడిన ద్రవరూప ఇనుము ఒక్కసారిగా మీదపడి తీవ్రంగా గాయపడ్డారు. ఉంగుటూరు మండలం పొట్టిపాడుకు చెందిన శ్రీనివాసరావు, తాడిగడపకు చెందిన భవానీశంకర్, పోరంకికి చెందిన సత్యనారాయణ అనే ముగ్గురు వ్యక్తుల శరీరం దాదాపు 75శాతం కాలిపోయింది. దీంతో అత్యవసర చికిత్స నిమిత్తం గుంటూరు జిల్లా మంగళగిరి ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని వైద్యులు తెలిపారు. క్షతగాత్రుల్లో బిహార్‌కు చెందిన నట్టుకుమార్‌ ఆరోగ్య పరిస్థితి నిలకడానే ఉందన్నారు. ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.