ఆంధ్రప్రదేశ్

andhra pradesh

బహుళ జాతి సంస్థలతో ఏపీ విట్ ఒప్పందం

By

Published : Nov 18, 2021, 7:49 PM IST

ఏపీ విట్ విశ్వవిద్యాలయం బహుళ జాతి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇంటెల్, బోస్టన్ సంస్థలతో విద్యా, ఐవోటీ, ఐఏ, పరిశోధనలపై ఒప్పందాలు చేసుకుంది.

బహుళ జాతి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ విట్
బహుళ జాతి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకున్న ఏపీ విట్

ఏపీ విట్ విశ్వవిద్యాలయం బహుళ జాతి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. ఇంటెల్, బోస్టన్ సంస్థలతో విద్యా, ఐవోటీ, ఐఏ, పరిశోధనలపై ఒప్పందాలు చేసుకుంది. ఈ ఒప్పంద పత్రాలపై విట్ వర్శిటీ ఉపకులపతి కోటారెడ్డి సంతకాలు చేశారు. ఇంటెల్ ఇండియా సంచాలకులు జితేంద్ర చద్దా, బోస్టన్ ఐటీ సొల్యూషన్ ప్రతినిధి లక్ష్మీ నాగేశ్వరీ ఆన్ లైన్ ద్వారా సంతకాలు చేశారు.

ఈ ఒప్పందాల ద్వారా విద్యార్థులకు ఐవోటీ, సమాచార మార్పిడి నెట్‌వర్క్‌ సృష్టించడానికి ఉపయోగపడుతోందని ఉపకులపతి కోటారెడ్డి తెలిపారు. ముఖ్యంగా పరిశ్రమ-విద్యార్థుల మధ్య అంతరాలను తగ్గించేలా ఉంటుందన్నారు.

ఇదీ చదవండి:

నలుగురు బాలికలపై రేప్.. దోషిగా తేలినా జైలుశిక్ష లేదు!

ABOUT THE AUTHOR

...view details