ఆంధ్రప్రదేశ్

andhra pradesh

తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి

By

Published : Mar 18, 2021, 12:09 PM IST

Updated : Mar 18, 2021, 2:55 PM IST

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. మున్సిపల్‌ వైస్‌ ఛైర్‌పర్సన్‌గా సరస్వతిని ఎన్నుకున్నారు. సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు మద్దతు పలకడంతో తెదేపా బలం 20కి చేరింది. తాడిపత్రిలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగాయని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి అన్నారు.‌

Jc Prabhakar Reddy as Tadipatri Municipal Chairman
తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి

ఆసక్తితో పాటు ఉత్కంఠ రేకెత్తించిన అనంతపురం జిల్లా తాడిపత్రి పురపాలక ఛైర్మన్‌ ఎన్నిక... ఎట్టకేలకు తెలుగుదేశం వశమైంది. మున్సిపల్‌ ఛైర్మన్‌గా జేసీ ప్రభాకర్‌రెడ్డి ఎన్నికయ్యారు. 18 మంది తెలుగుదేశం అభ్యర్థులతో పాటు సీపీఐ, స్వతంత్ర అభ్యర్థులు జేసీకే మద్దతు పలికారు. మొత్తంగా తెలుగుదేశం పార్టీకి 20 మంది సభ్యులు మద్దతు పలికారు. అధికార పార్టీ వైకాపాకు 18 ఓట్లు దక్కాయి. ఛైర్మన్​గా ఎన్నికైన అనంతరం మాట్లాడిన జేసీ ప్రభాకర్ రెడ్డి... త్వరలో ముఖ్యమంత్రిని కలుస్తానని తెలిపారు.

తెదేపాకు సహకరిస్తాం..!

తాడిపత్రి అభివృద్ధి కోసం ఎన్నికైన ఛైర్మన్​కు సహాయ సహకారాన్ని అందజేస్తామని ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తెలిపారు. పట్టణంలో ప్రజాస్వామ్యంగా ఎన్నికలు జరిగాయని వ్యాఖ్యానించారు. గత 30 సంవత్సరాలుగా ఇలా ప్రశాంతంగా ఎన్నడూ ఎన్నికలు జరగలేదని పేర్కొన్నారు.

ఇదీ చూడండి:

లైవ్ అప్​డేట్స్: కార్పొరేషన్ల మేయర్లు, మున్సిపల్‌ ఛైర్మన్ల ఎన్నిక

Last Updated :Mar 18, 2021, 2:55 PM IST

ABOUT THE AUTHOR

...view details