ఆంధ్రప్రదేశ్

andhra pradesh

'నాడు - నేడు' నిధులు స్వాహా - పనులు చేయకుండానే ప్రధానోపాధ్యాయుడి చేతివాటం

By ETV Bharat Andhra Pradesh Team

Published : Nov 24, 2023, 12:34 PM IST

Head Master Corruption in Nadu Nedu Funds: ప్రభుత్వ పాఠశాలలో అభివృద్ధి పనులకు మంజూరైన నిధులను ప్రధానోపాధ్యాయులు స్వాహా చేయడం చర్చనీయాంశంగా మారింది. అనకాపల్లి జిల్లా బీబీ పట్నంలో నాడు నేడు కింద తాగునీరు, మరుగుదొడ్లు, విద్యుదీకరణ, ప్రహరీ నిర్మించడానికి.. విడుదలైన నిధులను హెచ్ఎం బాబ్జీరావ్ అవినీతి చేసినట్లు ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. హెచ్ఎం బాబ్జీరావ్ మరోచోటకి బదిలీ అవ్వడంతో.. ఆయన చేసిన అవినీతి బట్టబయలు అయ్యింది.

Head_Master_Corruption_in_Nadu_Nedu_Funds
Head_Master_Corruption_in_Nadu_Nedu_Funds

Head Master Corruption in Nadu Nedu Funds :సర్కార్ సొత్తు అంటే అందరికీ లోకువే. ఎవరికి ఇష్టం వచ్చినట్టు చేసుకుంటూ ప్రభుత్వ లక్ష్యాలను నీరు గారుస్తున్నారు. ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లోని ప్రభుత్వ పాఠశాలలోని విద్యార్థులు పలు అవస్థలు పడుతున్నారు. అనకాపల్లి జిల్లా రోలుగుంట మండలం బీబీ పట్నంలో చోటు చేసుకున్ననాడు-నేడు నిధులస్వాహా వ్యవహారమే అర్థం పడుతుంది. ఈ గ్రామ జడ్పీ పాఠశాలలో పలు అభివృద్ధి పనులకు గాను మంజూరైన నాడు-నేడు నిధులలో అక్కడే ప్రధానోపాధ్యాయులు స్వాహా చేయడం ఉపాధ్యాయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

'నాడు - నేడు' నిధులు స్వాహా - పనులు చేయకుండానే ప్రధానోపాధ్యాయుడి చేతివాటం

నాడు-నేడు పనుల్లో అక్రమాలు - పెద్ద మొత్తంలో ఇనుము, సిమెంట్ మాయం

HM Babji Rao Withdraw Nadu Nedu Funds :సుమారు 160 మంది విద్యార్థులు చదువుతున్న బీబీ పట్నం జిల్లా పరిషత్ హై స్కూల్లో కనీస మౌలిక వసతులు కల్పనకు ప్రభుత్వం రెండో విడత నాడు-నేడులో సుమారు 62 లక్షల రూపాయలను మంజూరు చేసింది. వీటిలో 20 లక్షలకుపైగా విద్యార్థులకు కూర్చునేందుకు బల్లలు ఇతర ఫర్నిచర్​కుగాను కేటాయింపు చేయగా మిగిలిన 42 లక్షల రూపాయలను తరగతి గదులు, ప్రహరీ, మరుగుదొడ్లు, తాగునీరు, విద్యుద్దీకరణ తదితర వసతుల కల్పనకు గాను వినియోగించాల్సి ఉంది. ఈ పనులు చేపట్టేందుకు ముందు పాఠశాల విద్యా కమిటీ తీర్మానాలను ఆమోదించి వాటి ప్రకారం చేపట్టాల్సి ఉంది. అయితే ఇక్కడ జూన్ నెల వరకు విధులను నిర్వహించిన హెచ్ఎం బాబ్జీరావ్ కమిటీ తీర్మానాలు లేకుండా, చైర్మన్ ప్రమేయం లేకుండా కొంత నగదు డ్రా చేశారు. హెచ్ఎం బాబ్జీరావ్ ఈ ఏడాది జూన్ 8వ తేదీన మరోచోటకు బదిలీ అయ్యారు.

Nadu Nedu Works Not Complited: నిధులు విడుదల చేయని ప్రభుత్వం.. ఆగిన నాడు - నేడు పనులు

Nadu Nedu Scheme :అనంతరం బాబ్జీరావ్ స్థానంలో నక్కపల్లి నిధులు నిర్వహించే అప్పారావు బీబీ పట్నం హెచ్ఎంగా బాధ్యతలు స్వీకరించారు. బాబ్జీరావ్​కి బాధ్యతలు అప్పగించే సమయంలో నాడు నేడు నిధులకు వినియోగానికి సంబంధించి చేపట్టిన పనులు, డ్రా చేసిన నిధులకు పొంతన లేకపోవడం గుర్తించారు. అలాగే పాఠశాల అభివృద్ధి పనులు అసంపూర్తిగా ఉండటం చూసి.. అందులోని అవకతవకలు గుర్తించి జిల్లా విద్యాశాఖ అధికారికి అప్పారావు ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలోనే అసంపూర్తిగా ఉన్న పనులను ఈ ఏడాది జులై 31 పూర్తి చేస్తానని బాబ్జీరావ్ లిఖితపూర్వకంగా హామీ ఇచ్చారు. అయితే ఆ పనులు నేటి వరకు పూర్తిగా కాకపోవడం తో డీఈఓ విచారణకు ఆదేశించారు. దీనిలో భాగంగానే సర్వ శిక్ష అభియాన్ అధికారులు విచారణ చేపట్టారు ఇందులో సుమారు 10 నుంచి 15 లక్షల రూపాయల మేర అవినీతి జరిగినట్టు జిల్లా కలెక్టర్​కి నివేదిక సమర్పించారు.

YSRCP Government Negligence in Nadu Nedu Works: నాడు-నేడు పనుల్లో బయటపడుతున్న డొల్లతనం.. ఇదేనా మీరు మార్చిన రూపురేఖలు సీఎం గారూ?

ABOUT THE AUTHOR

...view details