నాడు నేడు బిల్లులు చెల్లించాలని ఆత్మహత్యకు ప్రయత్నించిన విద్యా కమిటీ చైర్ పర్సన్
Education Committee Chairperson Suicide Attempt: నాడు నేడు కార్యక్రమంలో భాగంగా చేపట్టిన పనులకు బిల్లులు రాలేదని శ్రీకాకుళం జిల్లాలో పాఠశాల విద్యా కమిటీ ఛైర్ పర్సన్ ఆత్మహత్యకు ప్రయత్నించారు. అప్పులు తెచ్చి నిర్మాణాలు చేపట్టగా.. బిల్లులు రాకపోవడంతో ఫినాయిల్ తాగారు. జిల్లాలోని పొందూరులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నాడు- నేడు పనుల బిల్లులు చెల్లించలేదంటూ పాఠశాల విద్యా కమిటీ ఛైర్ పర్సన్ రాధిక ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించారు. 25 లక్షలతో భవనాలు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా బిల్లు చెల్లించలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. భవన నిర్మాణాలకు తీసుకువచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక ఇబ్బంది పడుతున్న కూడా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదంటూ ఆమె ఈ చర్యకు పూనుకున్నారు. పాఠశాల గదులు శుభ్రం చేసే ఫినాయిల్ తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నించగా.. అక్కడున్న వారు గమనించి ఆమెను పొందూరు ప్రభుత్వాసుపత్రి తరలించి చికిత్స అందించారు. బిల్లులు చెల్లించాలని ప్రధానోపాధ్యాయులకు పలుమార్లు మొరపెట్టుకున్నా ఫలితం లేకపోయిందని.. రాధిక ఆవేదన వ్యక్తం చేశారు.