ఆంధ్రప్రదేశ్

andhra pradesh

స్వరాజ్యం కోసం బలమైన వాణిని వినిపించిన వ్యక్తి అలీషా: ఉపరాష్ట్రపతి

By

Published : Nov 5, 2021, 4:28 PM IST

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వకళాపరిషత్ కన్వెన్షన్ సెంటర్ లో శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పూర్వ పీఠాధిపతి ఉమర్ అలీషా(Shri Umar Alisha news) జీవిత చరిత్రను, పార్లమెంట్ ప్రసంగాల పుస్తకాలను ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ఆవిష్కరించారు(Vice President, Shri M. Venkaiah Naidu news). ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. ఉమర్ అలీషా సేవలను గుర్తు చేశారు.

Vice President Venkaiah Naidu
Vice President Venkaiah Naidu

స్వాతంత్య్ర ఉద్యమంలో తమ జీవితాలను త్యాగం చేసిన మహనీయుల నుంచి భారతీయ యువత స్ఫూర్తి పొందాలని, తద్వారా నవభారత నిర్మాణంలో భాగస్వాములు కావాలని ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు(Vice President, Shri M. Venkaiah Naidu news) ఆకాంక్షించారు. ఆ మహనీయులు కృషి చేసింది వారి కోసం కాదని, భవిష్యత్ తరాల అభివృద్ధి కోసమని తెలిపారు. వివక్షలకు తావులేని సమాజ నిర్మాణమే వారికి మనం అందించే నిజమైన నివాళి అని ఆయన పేర్కొన్నారు.

విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వకళాపరిషత్ కన్వెన్షన్ సెంటర్​లో శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం పూర్వ పీఠాధిపతి ఉమర్ అలీషా జీవిత చరిత్రను, పార్లమెంట్ ప్రసంగాల పుస్తకాలను ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు(The Life And Parliamentary Debates Of Shri Umar Alisha news). ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన.. 1885 – 1945 మధ్య కాలానికి చెందిన ఉమర్ అలీషా గొప్ప స్వాతంత్య్ర సమరయోధులన్నారు. మహా పండింతుడు, మేధావి, బహు గ్రంథకర్త, మహావక్త అయిన అలీషా అంగ్లేయుల కాలంలో కేంద్ర చట్టసభ సభ్యులుగా సేవలందించారని తెలిపారు. స్వరాజ్యం కోసం అలీషా చట్టసభల్లో చేసిన ప్రసంగాలను పుస్తకంగా తీసుకురావడం అభినందనీయమన్నారు.

ఆధ్యాత్మిక మార్గంలోని అంతరార్ధం సేవామార్గమే అన్న ఉపరాష్ట్రపతి.. ఉమర్ అలీషా ఈ స్ఫూర్తిని ఆచరణలో చూపించారని తెలిపారు. స్వీయ ఆధ్యాత్మిక మార్గం ద్వారా భగవంతుని ప్రేమను పొందడమే సూఫీ తత్వమన్న ఆయన.. సర్వమతాలు ఇదే సిద్ధాంతాన్ని ప్రవచించాయని తెలిపారు. ఆధ్యాత్మికత అనేది సమాజ మేలును కాంక్షించేదిగా ఉండాలన్నారు. ఆధ్యాత్మికవేత్తలు ప్రజల్లోకి వెళ్లి, వారిలో చైతన్యం తీసుకువచ్చినప్పుడే గొప్ప కార్యాలు సాధించడం సాధ్యమౌతుందని సూచించారు. ఆధ్యాత్మికత, సేవ రెండూ వేరు వేరు కాదన్న ఆయన, ఆధ్యాత్మిక మార్గం అంటే పూజా విధానం కాదని, మనోబలాన్ని పెంచే మహోన్నత జీవన విధానమని వ్యాఖ్యానించారు.

ఇదీ చదవండి:CBN Letter To SEC:'కుప్పం మున్సిపల్ ఎన్నికల్లో అక్రమాలు'..ఎస్​ఈసీకి చంద్రబాబు లేఖ

ABOUT THE AUTHOR

...view details