ఆంధ్రప్రదేశ్

andhra pradesh

Bharat bhand: భారత్‌ బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు: పేర్ని నాని

By

Published : Sep 25, 2021, 5:05 PM IST

Updated : Sep 25, 2021, 6:32 PM IST

భారత్‌ బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు
భారత్‌ బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు

17:01 September 25

భారత్‌బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు

భారత్‌ బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు

రైతుచట్టాలకు వ్యతిరేకంగా ఈనెల 27న రైతు సంఘాలు తలపెట్టిన భారత్‌ బంద్‌కు రాష్ట్ర ప్రభుత్వం మద్దతునిస్తుందని మంత్రి పేర్ని నాని స్పష్టం చేశారు. సోమవారం 27 అర్ధరాత్రి నుంచి 28 మధ్యాహ్నం వరకు బస్సులు నిలిపివేయనున్నట్లు తెలిపారు. రైతుచట్టాలు, విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు నిరసనగా భారత్‌ బంద్​కు మద్దతునిస్తున్నామని తెలిపారు.

పలు పార్టీలు, సంఘాల మద్దతు

ఈ నెల 27న తలపెట్టిన భారత్​ బంద్​కు(Bharat-bandh) సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు ఏపీ లారీ ఓనర్స్​​ అసోషియేషన్​ ప్రకటించింది. ఏపీ రైతు సంఘాల సమన్వయ కమిటీ భారత్​ బంద్​ పిలుపు మేరకు.. ఆందోళనకు మద్దతు ఇస్తున్నట్లు ఏపీ లారీ ఓనర్స్​​ అసోషియేషన్ అసోషియేషన్(lorry-owners-association) ప్రధాన కార్యదర్శి వైవీ ఈశ్వరరావు తెలిపారు.

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు (New Agriculture Bills) వ్యతిరేకంగా ఈ నెల 27న రైతు సంఘాలు చేపట్టిన భారత్ బంద్​కు (Bharat Bandh) సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామని తెదేపా రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (Atchennaidu) వెల్లడించారు. రైతుల ప్రయోజనాలే తెదేపాకి (TDP) ప్రధానమని ఆయన స్పష్టం చేశారు. తెదేపా కార్యకర్తలు, నాయకలు బంద్​లో పాల్గొని విజయవంతం చేయాలని అచ్చెన్నాయుడు సూచించారు. రైతు వ్యతిరేక చట్టాలపై కేంద్రం పునరాలోచించాలని తమ ఎంపీలు పార్లమెంట్​లో (Parlament) గళం విప్పారని గుర్తు చేశారు. తెదేపాతో పాటు సీపీఐ, సీపీఎం పార్టీలు భారత్ బంద్​కు మద్దతిచ్చాయి. 

ఇదీ చదవండి

'ఈనెల 27న తలపెట్టిన భారత్ బంద్​కు సంపూర్ణ మద్దతు'

Last Updated :Sep 25, 2021, 6:32 PM IST

TAGGED:

ABOUT THE AUTHOR

...view details