ETV Bharat / state

'ఈనెల 27న తలపెట్టిన భారత్ బంద్​కు సంపూర్ణ మద్దతు'

author img

By

Published : Sep 4, 2021, 10:20 PM IST

Vadde Sobhanadreeswara Rao
భారత్ బంద్​కు సంపూర్ణ మద్దతు​

సంయుక్త కిసాన్ మోర్చా.. ఈనెల 27న తలపెట్టిన భారత్ బంద్​(Bharat bandh)కు అన్నివర్గాల నుంచి మద్దతు లభిస్తుందని, రైతు సంఘం నాయకులు, కిసాన్ కోర్డినేషన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. బంద్​లో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనేలా చైతన్య పర్చేందుకు సదస్సులు నిర్వహిస్తామన్నారు.

ఈనెల 27న సంయుక్త కిసాన్ మోర్చా తలపెట్టిన భారత్ బంద్(Bharat bandh)​లో ప్రజలంతా స్వచ్ఛందంగా పాల్గొనేలా చైతన్య సదస్సులు నిర్వహిస్తామని రైతు సంఘ నాయకులు, కిసాన్ కోర్డినేషన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు అన్నారు. భారత్​ బంద్​కు ప్రజా, రైతు, కార్మిక సంఘాల నుంచి మద్దతు లభిస్తుందని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలు, విద్యుత్ సవరణ, లేబర్ కోడ్​ల రద్దు, ప్రభుత్వ ఆస్తుల అమ్మకం నిర్ణయం వెనక్కి తీసుకోవాలి డిమాండ్ చేస్తూ.. ఈనెల 27న భారత్ బంద్​కు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపునిచ్చింది.

అసెంబ్లీలో తీర్మానం చేయాలి..

రాష్ట్రంలో విద్యుత్ సవరణ చట్టం అమలులోకి రాక ముందే రాష్ట్ర ప్రభుత్వం జీవో నంబర్ 22తో రైతులను బలవంతంగా ఒప్పించే యత్నాలు చేస్తోందని వడ్డే శోభనాద్రీశ్వరరావు మండిపడ్డారు. ఉచిత విద్యుత్ ఇవ్వలేమనే ధోరణితో ప్రభుత్వం ముందుకెళ్తుందన్నారు. వ్యవసాయ చట్టాలు,విద్యుత్ సవరణ బిల్లులను వ్యతిరేకిస్తూ.. అసెంబ్లీలో తీర్మానం చేయాలని డిమాండ్ చేశారు.

ఇదీ చదవండి..

PDS RICE SCAM: 'పౌరసరఫరాల శాఖలో రూ. 4వేల కోట్ల కుంభకోణం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.