ఆంధ్రప్రదేశ్

andhra pradesh

రోడ్లు గుంతలమయం.. భయంగా ప్రయాణం

By

Published : Oct 10, 2020, 5:08 PM IST

Updated : Oct 10, 2020, 5:39 PM IST

కర్నూలు నగరంలో రహదారులు దారుణంగా తయారయ్యాయి. ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి వెళ్లాలంటే నరకం కనిపిస్తోంది. గోతులమయమైన రోడ్డులో ప్రయాణం సాగటం లేదు. ఎక్కువగా అంబులెన్స్ లు తిరిగే మార్గంలో రహదారులు బాగా దెబ్బతినటం మరింత ఆందోళన కలిగిస్తోంది.

roads damaged
roads damaged

అది నిత్యం రద్దీగా ఉండే మార్గం. వేలాది వాహనాలు రాకపోకలు సాగించే రహదారి. ప్రజాప్రతినిధులు, కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు, అధికారులు కలెక్టరేట్ కు వచ్చివెళ్లే దారి. కర్నూలు నుంచి నంద్యాల, కడప, తిరుపతి, చిత్తూరు, శ్రీశైలం, గుంటూరు, విజయవాడకు వెళ్లే ప్రధాన రహదారి. పెద్దాసుపత్రికి వెళ్లాలన్నా... గాయిత్రీ ఎస్టేట్ లోని ప్రయివేటు ఆసుపత్రులకు వెళ్లాలన్నా ఇదే మార్గంలో రోగులు రాకపోకలు సాగించాలి. ఇంతటి రద్దీ ఉన్న సెంట్రల్ ప్లాజ్ మార్గంలో రహదారులు బాగా దెబ్బతిన్నాయి. రాకపోకలు సాగించటం ప్రయాణికులకు నరకప్రాయమవుతోంది. గతుకుల రోడ్డులో ప్రయాణమంటేనే సాధారణ ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.

భారీ వర్షాలతో...

రోడ్లు గుంతలమయం.. భయంగా ప్రయాణం

ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో కురిసిన భారీ వర్షాలకు రహదారులు బాగా దెబ్బతిన్నాయి. కంకర తేలింది. వాహనాల రాకపోకల కారణంగా... దుమ్మూధూళితో చాలామందికి శ్వాసకోస సమస్యలు తలెత్తుతున్నాయి. నడుమునొప్పులు తప్పటం లేదు. ఒక్కసారి ఈ మార్గంలో వస్తే... రెండోసారి రావటానికి భయపడుతున్న దయనీయ స్థితి. కనీసం ఇప్పటికైనా వర్షాలకు దెబ్బతిన్న రహదారులను పూర్తి చేయాలని నగర వాసులు కోరుతున్నారు.

కేవలం సెంట్రల్ ప్లాజానే కాదు... ఎన్టీఆర్ సర్కిల్, వడ్డెగేరి, మమతానగర్, అశోక్ నగర్ ప్రధాన రహదారి, రాజ్ విహార్ కూడలి, మౌర్యాఇన్ మార్గం, ఓల్డ్ ఈద్గా మార్గాల్లో అక్కడక్కడా రహదారులు దెబ్బతిన్నాయి. వీటి పనులు కూడా త్వరగా పూర్తి చేయాలని ప్రజలు అధికారులకు విజ్ఞప్తి చేస్తున్నారు.

ఇదీ చదవండి:

ఏపీ ఎంసెట్‌ ఫలితాలు విడుదల

Last Updated :Oct 10, 2020, 5:39 PM IST

ABOUT THE AUTHOR

...view details