ఆంధ్రప్రదేశ్

andhra pradesh

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9 AM

By

Published : May 12, 2022, 9:02 AM IST

TOP NEWS

.

  • Asani Effect: 'అసని' తుపాను దెబ్బ.. వరి వర్షార్పణం..!
    Asani Effect: కోతకొచ్చిన పైరు నేలవాలింది.! తుపాను రాకముందే కళ్లాల్లో పోగేసిన పంట వర్షార్పణమైంది..! కాస్తోకూస్తో చేతికొచ్చినా.. పెట్టుబడి ఖర్చులూ దక్కేలాలేవు..! గోదావరి జిల్లాల్లో వరి రైతులకు 'అసని' తుపాను నిండా ముంచింది. ఆరుగాలం శ్రమిస్తే ఒక్క వర్షం మొత్తం ఊడ్చేసిందని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ తర్వాత .. నేడు కేబినెట్‌ తొలి భేటీ
    మంత్రివర్గ పునఃవ్యవస్థీకరణ తర్వాత తొలిసారి రాష్ట్ర కేబినెట్ భేటీ కానుంది. ముఖ్యమంత్రి జగన్ అధ్యక్షతన సచివాలయం మొదటి బ్లాక్​లో మద్యాహ్నం 3 గంటలకు మంత్రివర్గ సమావేశం జరుగనుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • PRC: పదవీ విరమణ తర్వాతే పీఆర్సీ, డీఏ బకాయిలు..!
    P.R.C హామీలపై ప్రభుత్వం మరో మెలిక పెట్టింది. పదవీ విరమణ తర్వాతే P.R.C. బకాయిలు చెల్లిస్తామని ప్రకటించింది. అయితే...I.R. రికవరీ నిలిపివేస్తామంటూ చిన్నపాటి ఊరటకలిగించింది. మొత్తం 8 ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం విశ్వవిద్యాలయాలు, కార్పొరేషన్లు, సొసైటీలకూ P.R.C. వర్తిస్తుందని ప్రకటించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • పోలవరం ప్రాజెక్టును సందర్శించిన.. సీడబ్ల్యూసీ కమిటీ
    పోలవరం ప్రాజెక్టును వేగంగా పూర్తి చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలంటూ....సీడబ్ల్యూసీ కమిటీ సభ్యుల బృందం జలవనరుల శాఖ అధికారులకు సూచించింది. సీడబ్ల్యూసీ. కమిటీ డైరెక్టర్లు మహమ్మద్, రాహుల్ కుమార్ సింగ్ నేతృత్వంలో ప్రాజెక్టులోని స్పిల్‌వే, రేడియల్ గేట్స్, ఫిష్ లేడర్‌పై ఆరా తీశారు. జలవనరుల శాఖ అధికారులు పనుల పురోగతిపై వివరాలు వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • టమాటా ఫ్లూ కలకలం.. ఆస్పత్రుల పాలవుతున్న చిన్నారులు!
    Tomato flu Kerala: కేరళలో ఐదేళ్లలోపు పిల్లల్లో వింత జబ్బు కలకలం సృష్టిస్తోంది. టమాటా ఫ్లూగా పిలిచే అత్యంత అరుదైన వైరస్​.. ఇప్పటి వరకు 80 మందికిపైగా చిన్నారులకు సోకింది. టమాటా ఫ్లూ వ్యాప్తి నేపథ్యంలో కేరళ పొరుగు రాష్ట్రం అప్రమత్తమైంది. సరిహద్దుల్లోనే వైద్య శిబిరం ఏర్పాటు చేసి పరీక్షలు నిర్వహిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • స్నేహితుడిని కలిసేందుకు దుబాయ్​ వెళ్లి.. ఎమ్మెల్యే హఠాన్మరణం
    MLA Ramesh Latke: శివసేన శాసనసభ్యుడు రమేశ్​ లట్కే మరణించారు. హార్ట్​ ఎటాక్​తో బుధవారం రాత్రి దుబాయ్​లో చనిపోయినట్లు మహారాష్ట్ర రవాణా మంత్రి అనిల్​ పరబ్​ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • కొరియాలో కరోనా తొలి కేసు.. కఠిన చర్యలకు కిమ్​ ఆదేశం!
    North Korea First Covid case: ఉత్తర కొరియాలో కరోనా తొలి కేసు నమోదైంది. దీంతో అత్యవసరంగా సమావేశమైన ఆ దేశాధినేత కిమ్​ జోంగ్​.. కట్టడి చర్యలను పెంచాలని అధికారులను ఆదేశించారు​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Ethos IPO: ఎథోస్‌ ఐపీఓ తేదీ ఖరారు.. వివరాలివే..
    Ethos IPO: తొలి పబ్లిక్‌ ఆఫర్‌కు (ఐపీఓ) రాబోతున్నట్లు వెల్లడించింది ఎథోస్​ సంస్థ. ఈ ఐపీఓ ఈ నెల 18న ప్రారంభంకానుంది. ఈ ఇష్యూకు ధరల శ్రేణిగా రూ.836- 878ను సంస్థ నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • అందుకే ఔట్ అయినప్పుడు నవ్వుతున్నా: కోహ్లీ
    Kohli Smile reaction getting out: ఈ సీజన్​లో వరుసగా తక్కువ స్కోర్లకు వెనుదిరుగుతున్నపుడు కోహ్లీ నవ్వు ముఖం పెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే ఆ స్పందనకు కారణమేంటో విరాట్‌ వెల్లడించాడు. దీంతోపాటే వచ్చే ఏడాది ఏబీ డివిలియర్స్ బెంగళూరు జట్టులో కోచింగ్‌ స్టాఫ్‌గా చేరొచ్చనే సంకేతాలను కూడా ఇచ్చాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • మహేశ్​ 'సర్కారు వారి పాట' టాక్​ ఎలా ఉందంటే?
    Sarkaru Vaaripata twitter review: పరశురామ్​ దర్శకత్వంలో సూపర్​స్టార్​ మహేశ్​బాబు-కీర్తిసురేశ్​ జంటగా నటించిన 'సర్కారు వారి పాట' గురువారం థియేటర్లలో విడుదలైంది. ఈ సినిమా రివ్యూను చూసేద్దాం.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ABOUT THE AUTHOR

...view details